ఓటీటీలోకి 3321 కోట్ల సినిమా.. ఒళ్లు గగుర్పొడిచేలా చేసే దీన్ని ఎలా చూడాలంటే!
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో సినిమాలు వస్తుంటాయి. అందులో హాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలకు అన్ని దేశాల్లోనూ మంచి స్పందన లభిస్తుంటుంది. ముఖ్యంగా అక్కడ రూపొందే అడ్వెంచరస్ మూవీలు మరింత ఎక్కువగా ఆదరణను అందుకుంటున్నాయి. అలా గతంలో 'ఏప్స్' (Apes) ఫ్రాంచైజీలో చాలా చిత్రాలు వచ్చాయి. అవన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన మరో చిత్రమే 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' (Kingdom of the Planet of the Apes).
ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్ ప్రధాన పాత్రల్లో వెస్ బాల్ రూపొందించిన చిత్రమే 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'. గతంలో పరస్పరం యుద్దాలు చేసుకున్న చింపాంజీలు, మనుషుల మధ్య సయోధ్య కుదిర్చేలా ఓ యువతి, చింపాంజీతో కలిసి చేసే ప్రయాణం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. దీంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి.

అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వచ్చిన 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' చిత్రానికి టాక్ బాగా రాకున్నా.. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన దక్కింది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ మూవీ 396.7 మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3321 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అడ్వెంచర్ వండర్‌గా రూపొందిన 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' మూవీ థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుని సక్సెస్ అయింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కుల కోసం చాలా సంస్థలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఇండియాకు సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే ముట్టజెప్పింది.
'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' సినిమా డిజిటల్ పార్ట్‌నర్ అయిన డిస్నీ హాట్‌స్టార్ ఈ చిత్రాన్ని ఆగస్టు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంటుందని కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' సినిమాను 20 సెంచరీ స్టూడియోస్, ఆడ్‌బాల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జానస్ టీ రీడ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెస్ బాల్, జో హార్ట్‌విక్ జూనియర్, రిక్ జప్పా, అమాండా సిల్వర్, జానస్ టీ రీడ్‌లు నిర్మించారు. జాన్ పెసనో మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో కెవిన్ డురాండ్, పీటర్ మాకాన్, విలియం హెచ్. మేసీలు నటించారు.


Click it and Unblock the Notifications











