పొట్టచెక్కలయ్యేలా నవ్వించే రీసెంట్ కామెడీ మూవీ OTTలోకి, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీలోకి వస్తూ సందడి చేస్తున్నాయి. అంతా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతుండగా.. దర్శక, నిర్మాతలు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువగా తీసుకు వస్తూ సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు.
ఇప్పటికే ఇలాంటి చిత్రాలు ఎక్కువగా ఉన్నా కొత్త పాయింట్ లతో చిత్రాలను తెరకెక్కిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో అనేక క్రేజీ కామెడీ చిత్రాలు ఉండగా.. మరో కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళంలో వచ్చిన రీసెంట్ కామెడీ డ్రామా చిత్రమే ది బాయ్స్. సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్ పి జయకుమార్ తో పాటు షరా, అర్షద్, కెపివై వినోద్, యువరాజ్ గణేశన్, రెడిన్ కింగ్స్లీ, రాజేంద్రన్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. మార్చి 29వ తేదీన థియేటర్లలో విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కె అహమ్మద్ షెరీఫ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే అరుణ్ గౌతమ్ సంగీతం అందించగా.. సామ్ ఆర్డీఎక్స్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నాడు.
నోవా ఫిల్మ్ స్టూడియోస్ అండ్ డార్క్ రూమ్ పిక్చర్స్ బ్యానర్ పై ఇ సెంథిల్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఐదుగురు స్నేహితులు కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. ప్రతీక్షణం నవ్వేలా ప్లాన్ చేసుకుంటూ చేసిన ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్విస్తూనే ఉంటుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ఈ క్రేజీ మూవీ బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా తమిళ్ వేదికగా ది బాయ్స్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ముఖ్యంగా మరో రెండు రోజుల్లో అంటే మే 7వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ వేదికగా ఆహా తమిళ్ సంస్థే నేరుగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని చూడాలని అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











