Kingston OTT : ఓటీటీలోకి జీవీ ప్రకాష్ కుమార్ మూవీ.. ఇండియాలో ఫస్ట్ సీ అడ్వెంచర్ ఎందులో అంటే?
దక్షిణాదిలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు జీవీ ప్రకాష్ కుమార్. మాస్ అయినా, క్లాస్ అయినా, మెలోడీ అయినా అద్భుతంగా ట్యూన్ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు ప్రకాష్. సంగీత దర్శకుడిగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే హీరోగానూ సత్తా చాటారు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్‌లో 25వ చిత్రమే కింగ్‌స్టన్. ఇటీవల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాల్లోకి వెళితే..
సముద్రంపై సాహాసాలు, హార్రర్, థ్రిల్లర్ వంటి ఎలిమింట్స్‌తో ఎక్కువగా హాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలో తెరకెక్కుతుంటాయి. ఇండియాలో మొదటిసారిగా ఈ ఫీట్ చేసిన హీరోగా నిలిచారు జీవీ ప్రకాశ్ కుమార్. కింగ్‌స్టన్ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రికార్డుల్లోకెక్కింది. టీజర్లు, ట్రైలర్లు, ఫోటోలు, ప్రమోషన్ కార్యక్రమాలతోనే ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసుకుని మోస్ట్ అవైటింగ్ మూవీగా నిలిచింది.

కింగ్‌స్టన్‌లో జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్‌గా నటించగా కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ప్యార్లల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై జీవీ ప్రకాష్ కుమార్ , భవానీ శ్రీ, ఉమేశ్ కుమార్ భన్సాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా మూడు అవతారాలెత్తారు జీవి ప్రకాష్ కుమార్. హార్రర్, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 7 , 2025న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తమిళనాడులోని ఓ మారుమూల సముద్రాన్ని ఆనుకుని ఉండే గ్రామంలో జరిగే సంఘటన చుట్టూ కింగ్‌స్టన్ మూవీ తిరుగుతుంది. 1982లో ఏం జరిగింది? సముద్రంలోకి వెళ్లినవారు శవాలై ఎందుకు తిరిగిస్తున్నారు? ఆత్మలకు ఆ గ్రామానికి సంబంధం ఏంటీ? సముద్రంలో ఓ ముఠా చేస్తున్న చీకటి పనులేంటీ? కింగ్‌స్టన్ తన గ్రామాన్ని ఎలా రక్షించాడన్నదే ఈ సినిమా కథ.
నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలకు కలిపి కింగ్‌స్టన్‌కు రూ.20 కోట్ల బడ్జెట్ అయ్యింది. తొలి రోజు ఈ సినిమా నికరంగా 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు రూ.1.22 కోట్ల నెట్, మూడో రోజు రూ.1.02 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.51 లక్షల నెట్, ఐదవ రోజు రూ.37 లక్షల నెట్, ఆరో రోజు రూ.27 లక్షల నెట్, ఏడో రోజున రూ.23 లక్షల నెట్ వసూలు చేసింది. రెండో వారం నుంచి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా రూ.6 కోట్లు మాత్రమే రాబట్టి ఫ్లాప్‌గా నిలిచింది.
థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో జీవీ ప్రకాష్ కుమార్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కింగ్‌స్టన్ ఓటీటీ రైట్స్‌ను జీ 5 సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 13 నుంచి జీ తమిళ్‌లో ఓటీటీలో ప్రసారం కానుంది. మరి థియేటర్‌లో అంతగా అలరించలేకపోయిన కింగ్‌స్టన్ ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











