Kingston OTT Release : ఓటీటీలోకి కింగ్‌స్టన్.. జీవీ ప్రకాష్ కుమార్ మూవీ ఏ ఓటీటీలో? ఎప్పుడంటే?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దుమ్మురేపుతున్నారు జీవీ ప్రకాష్ కుమార్. మెలోడీలకు, ఫీల్ గుడ్ మ్యూజిక్‌కు కేరాఫ్‌గా నిలిచిన ప్రకాష్ మోస్ట్ వాంటెడ్‌గా నిలిచారు. సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నప్పటికీ ఈ కుర్రాడికి నటుడిగానే రాణించాలని చిన్నప్పటి నుంచి ఆసక్తి. అలా ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించిన జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా నటించిన చిత్రం కింగ్‌స్టన్. ఇది నటుడిగా ఆయన కెరీర్‌లో 25వ చిత్రం. మహిళా దినోత్సవం కానుకగా మార్చి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. రిలీజై గంటల గడవకముందే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కింగ్‌స్టన్ సినిమా ఓటీటీ వివరాలు మీకోసం.

కింగ్‌స్టన్‌లో జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్‌గా నటించారు. కమల్ ప్రకాష్ దర్శకత్వంలో ప్యార్లల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై జీవీ ప్రకాష్ కుమార్ , భవానీ శ్రీ, ఉమేశ్ కుమార్ భన్సాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా వ్యవహరించి శెభాష్ అనిపించుకున్నారు జీవి ప్రకాష్ కుమార్. కింగ్‌స్టన్ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రికార్డుల్లోకెక్కింది. దాదాపు 20 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

Kingston OTT Release when to expect GV Prakash Kumar s Movie to stream online

టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు, తమిళ భాషలు సహా దక్షిణాదిలో దాదాపుగా 1500 స్క్రీన్లలో కింగ్‌స్టన్ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్‌ ఎంత పలికాయి? ఎవరు దక్కించుకున్నారు? అన్నది తెలియరాలేదు. అయితే కింగ్‌స్టన్ సినిమాకు రూ.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

ఇక తొలిరోజు జీవీ ప్రకాష్ కుమార్ సినిమాకు ఎన్ని కోట్లు కలెక్షన్స్ వచ్చాయో పరిశీలిస్తే ... ఫస్ట్ డే ఈ సినిమాకు మంచి ఆక్యూపెన్సీ నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా కింగ్‌స్టన్ సినిమాకు రూ.3.5 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఇందులో తమిళ్ నుంచి రూ.2 కోట్లు, తెలుగులో రూ.60 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.50 లక్షలు రాబట్టింది. వీకెండ్ కావడంతో పాటు డిఫరెంట్ స్టోరీ కావడంతో కింగ్‌స్టన్‌కు మంచి వసూళ్లు అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Kingston OTT Release when to expect GV Prakash Kumar s Movie to stream online

ఇక కింగ్‌స్టన్ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆ సెక్షన్ లవర్స్ క్యూకడుతున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సంస్థ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లో రిలీజైన దాదాపు 5 వారాల తర్వాత ఏ సినిమానైనా ఓటీటీలో విడుదల చేయాల్సి ఉంది. దీని ప్రకారం ఏప్రిల్ తొలి వారంలో కానీ , రెండవ వారంలో కానీ కింగ్‌స్టన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ త్వరగా రావొచ్చు, లేదంటే ఆలస్యం కావొచ్చు. మరి కింగ్‌స్టన్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: Kingston gv prakash kumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X