KA OTT: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ మూవీ.. కిరణ అబ్బవరం మూవీ స్ట్రీమింగ్ ఎప్పడంటే?
KA OTT Updated: హీరో కిరణ్ అబ్బవరం వరుస ఫ్లాఫ్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో భారీ సక్సెస్ అందించిన మూవీ 'క ' మూవీ దీపావళీ పండుగ సందర్బంగా విడుదలైన క మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్, స్టార్ హీరోకి వచ్చినట్టు వందల కోట్ల కలెక్షన్లు రాకపోయినా.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ కలెక్షన్ల మూవీగా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 50 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేంది. వివరాల్లోకెళ్తే..
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క. ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ లు ఈ మూవీని విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అయింది. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన 'క' మూవీలో తన్వి రామ్,అచ్యుత్ రామ్, రెడిన్ కింగ్స్ లీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

క మూవీ కథ విషయానికి వస్తే.. ఈ సోర్టీ 1977లో సాగుతోంది. హీరో కిరణ్ అబ్బవరం ..అభినయ వాసుదేవ్ అనే పాత్రను పోషించారు. అభినయ వాసుదేవ్ ఓ అనాథ. అతడి బాల్యం మొత్తం ఓ అనాథాశ్రమంలో గడుస్తోంది. అయితే.. వాసుదేవ్ కు ఇతర వ్యక్తుల ఉత్తరాలు చదివే అలవాటు ఉంది. ఆ ఆసక్తితోనే పెద్దయ్యాక క్రిష్ణగిరి అనే ఓ కొండ గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా చేరతాడు. ఈ క్రమంలో ఆ ఊరు హెడ్ పోస్టు మాస్టర్ రంగారావు కూతురు సత్యభామ(నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఈ కథ చాలా హ్యాపీగా.. సాగిపోతుంది.
ఈ తరుణంలో ఆ ఊళ్ళో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. దీంతో ఊరు మొత్తం భయాందోళనలకు గురవుతోంది. దొంగతనంగా ఇతరుల ఉత్తరాలు చదివే వాసుదేవ్ కి ఓ ఉత్తరం ద్వారా అమ్మయిల కిడ్నాప్ కు సంబంధించిన ఓ హింట్ దొరుకుతోంది. ఆ క్లూ ద్వారా మిస్టరీ కేసును ఎలా ఎలా చేదిస్తాడు? ఈ క్రమంలో వాసుదేవ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు?అనేది 'క'సినిమా.

గత కొంతకాలంగా హీరో కిరణ్ అబ్బవరంకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ అందలేదు. కానీ, క మూవీ గుడ్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. లక్కీ భాస్కర్, అమరన్, బఘీర లాంటి భారీ బడ్జెట్ మూవీలతో పోటీ పడుతూ.. 'క' మూవీ బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అయింది. ఎవరూ ఊహించని విధంగా భారీ మొత్తంలో కలెక్షన్లు వసూల్ చేసింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో క బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇదెలా ఉంటే.. కిరణ్ అబ్బవరం క మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకున్నది. ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











