Meter OTT: ఆ ఓటీటీలో మీటర్ స్ట్రీమింగ్.. విడుదలైన అన్ని రోజులకే మొదలా!
ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో బ్యాగ్రౌండ్ లేని వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇలా వచ్చి మొదటి సినిమాతోనే హైలైట్ అయిన వారిలో రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఇది డీసెంట్ హిట్ కొట్టడంతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 'ఎస్ఆర్ కల్యాణమండం', 'వినరో భాగ్యము విష్ణు కథ' వంటి హిట్లను అందుకుని ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు.
ఈ ఏడాది ఇప్పటికే 'వినరో భాగ్యము విష్ణు కథ'తో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం తాజాగా 'మీటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రమేష్ కడూరి తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ మొదటి రోజు ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగా దక్కింది. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా 'మీటర్' మూవీ ఓటీటీ డీల్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన 'మీటర్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అంటే ఏప్రిల్ 7న విడుదలైన 'మీటర్' మే రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.
కిరణ్ అబ్బవరం హీరోగా.. రమేష్ కడూరి రూపొందిన చిత్రమే 'మీటర్'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చెర్రీ, హేమలత పెదమల్లు నిర్మించారు. దీనికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇందులో ధనుష్ పవన్, పోసాని, సప్తగిరి తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











