Meter: ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మూవీ.. థియేటర్లలో చెత్త రికార్డు.. అక్కడ ఏం చేయబోతుందో!
గతంలో కంటే ఈ మధ్య కాలంలోనే బ్యాగ్రౌండ్ లేకపోయినా ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన టాలెంట్లతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటోన్నారు. అందులో నేచురల్ యాక్టర్‌గా పేరొందిన కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ వెంటనే 'ఎస్ఆర్ కల్యాణమండం', 'వినరో భాగ్యము విష్ణు కథ' వంటి హిట్లను అందుకుని ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు. దీంతో వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ ఏడాది 'వినరో భాగ్యము విష్ణు కథ'తో విజయాన్ని ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం.. ఏప్రిల్ 7వ తేదీన 'మీటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రమేష్ కడూరి తెరకెక్కించిన ఈ మూవీ ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే మొదటి రోజు ప్రేక్షకుల నుంచి ఏమాత్రం మంచి స్పందన దక్కలేదు. దీంతో ఈ చిత్రం వారం రోజులకే పరిమితం అయింది. ఫలితంగా ఇది ఏమాత్రం కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఫలితంగా జీరో షేర్ మూవీగా చెడ్డ పేరును కూడా మూటగట్టుకుందనే చెప్పాలి.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మీటర్' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఇప్పుడు మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ఇందులో ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.
యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం హీరోగా.. రమేష్ కడూరి తెరకెక్కించిన చిత్రమే 'మీటర్'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చెర్రీ, హేమలత పెదమల్లు నిర్మించారు. దీనికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇందులో ధనుష్ పవన్, పోసాని, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











