Rules Ranjann OTT: రూల్స్ రంజన్ ఓటీటీ వివరాలు లీక్.. అంత త్వరగా వచ్చేస్తుందా!

ఈ మధ్య కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది యువకులు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే వైవిధ్యాన్ని చూపిస్తూ.. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. మొదటి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా పలు హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వరుస పెట్టి ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కిరణ్ 'రూల్స్ రంజన్' అనే ఫన్ ఎంటర్‌టైనర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ రూపొందించిన క్రేజీ మూవీనే 'రూల్స్ రంజన్'. ఈ చిత్రానికి యూఎస్‌లోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే కంటిన్యూ అయింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రేక్షకుల నుంచి స్పందన సాధారణ స్థాయిలోనే దక్కింది. దీంతో దీనికి ఓపెనింగ్స్ మోస్తరుగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'రూల్స్ రంజన్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్, డేట్ వివరాలు బయటకు వచ్చాయి.

Kiran Abbavaram Starrer Rules Ranjann Movie OTT Streaming Details

పూర్తి స్థాయి వినోదంతో రూపొందిన 'రూల్స్ రంజన్' మూవీపై ఆరంభంలోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

'రూల్స్ రంజన్' మూవీని నాలుగు వారాల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే, మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన టాక్ దృష్ట్యా ఇందులో మార్పు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే.. ఈ సినిమాను నాలుగు వారాల కంటే ముందే స్ట్రీమింగ్‌కు తీసుకు రావొచ్చని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. తద్వారా అక్టోబర్ 6వ తేదీన విడుదలైన 'రూల్స్ రంజన్' అక్టోబర్ చివరి వారంలో కానీ, నవంబర్ మొదటి వారంలో కానీ స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.

Kiran Abbavaram Starrer Rules Ranjann Movie OTT Streaming Details

'రూల్స్ రంజన్' మూవీలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను స్ట్రైట్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో దివ్యాంగ్, వేమూరి మురళీ కృష్ణ నిర్మించారు. ఇందులో మెహర్ చహల్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, సుబ్బరాజు, వైవా హర్ష వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X