For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైఎస్ మరణంపై బాలయ్య కామెంట్: ప్రమాదానికి ముందే హెలీకాప్టర్‌లో.. ఆరోజే ఫోన్ చేశారన్న మాజీ సీఎం

  |

  టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేయడంతో పాటు సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతూ.. చాలా తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగిపోయారు. అప్పటి నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించిన బాలయ్య.. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే షోతో హోస్టుగా మారారు. ఇక, రెండో సీజన్‌లో గెస్టులుగా వచ్చిన వాళ్ల వల్ల వైఎస్ డెత్ తెరపైకి వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  రెండో సీజన్‌తో వచ్చేశారుగా

  రెండో సీజన్‌తో వచ్చేశారుగా

  నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన 'Unstoppable with NBK' టాక్ షో మొదటి సీజన్ భారీ స్పందనను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో ఆహా టీమ్ ఇప్పుడు రెండో సీజన్‌ను అక్టోబర్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఓటీటీ చరిత్రలోనే తొలిసారి ఈ షో కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించి సరికొత్త ఘనతను అందుకున్నారు.

  బికినీలో యాంకర్ రష్మీ అందాల ఆరబోత: నీళ్లలో తడిచి మరీ అలా చూపిస్తూ!

  చంద్రబాబును తీసుకొచ్చేసి

  చంద్రబాబును తీసుకొచ్చేసి

  టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14న స్ట్రీమింగ్ చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎపిసోడ్ కూడా మొదలైంది. దీనికి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చి.. రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి.

  2, 3 ఎపిసోడ్స్ కూడా హిట్టు

  2, 3 ఎపిసోడ్స్ కూడా హిట్టు

  'Unstoppable with NBK 2' షోలో భాగంగా రెండో ఎపిసోడ్‌కు టాలీవుడ్ యంగ్ హీరోలు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డలు హాజరయ్యారు. వీళ్లతో బాలయ్య ఓ రేంజ్‌లో సందడి చేశారు. అలాగే, మూడో ఎపిసోడ్ కోసం శర్వానంద్, అడివి శేష్‌లు వచ్చారు. వీళ్లతో కూడా బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. ఇలా ఈ ఎపిసోడ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

  యాంకర్ మంజూష అందాల అరాచకం: పైటను పక్కకు జరిపి మరీ హాట్ షో

  నాలుగో ఎపిసోడ్‌లో ఫ్రెండ్స్

  నాలుగో ఎపిసోడ్‌లో ఫ్రెండ్స్

  'Unstoppable with NBK 2' షోలో నాలుగో ఎపిసోడ్‌కు నటసింహా నందమూరి బాలకృష్ణ స్నేహితులు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ప్రముఖ సినీ నటి రాధికలు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లతో కలిసి బాలయ్య తన మధురానుభూతులను పంచుకున్నారు. అలాగే, కొన్ని కీలక విషయాలను బయటకు తెచ్చారు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్‌గా మారింది.

  12 గంటలకు ఫోన్ చేశాడని

  12 గంటలకు ఫోన్ చేశాడని

  తాజాగా వచ్చిన ప్రోమోలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇవ్వగానే బాలయ్య 'అధ్యక్షా' అంటూ ఆయన స్పీకర్‌గా ఉన్న రోజులు గుర్తు చేశారు. అప్పుడాయన 'నేను స్పీకర్ అయిన రోజు అర్ధరాత్రి 12 గంటలకు బాలయ్య ఫోన్ చేసి ఇదే మాట్లాడాడు' అని అన్నాడు. ఆ తర్వాత సురేష్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గురూ కలిసి కాసేపు క్రికెట్ ఆడి.. అల్లరి పనుల గురించి చెప్పారు.

  యాంకర్ వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్: ఆ పార్ట్‌ను హైలైట్ చేస్తూ అరాచకం

  వైఎస్సార్ ప్రమాదంపై కిరణ్

  నాలుగో ఎపిసోడ్ ప్రోమోలో బాలయ్య అలాగే, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడాయన 'నేను బ్రతికుండబట్టే సీఎం అయ్యాను. వైఎస్ గారిని ఓ సీనియర్ మంత్రి మిస్ లీడ్ చేసేవారు. హెలికాప్టర్ ఎక్కే రోజు రాత్రి ఎనిమిది గంటలకు' అంటూ సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తూ కట్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

  వైఎస్‌పై ప్రశంస.. రాధికతో

  వైఎస్‌పై ప్రశంస.. రాధికతో

  ఇక, ఈ ప్రోమోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి టాపిక్ వచ్చిన తర్వాత బాలయ్య 'మనం కొంత మంది గ్రేట్ లీడర్లను కోల్పోయాం. అందులో వైఎస్ ఒకరు' అని ప్రశంసించారు. ఆ తర్వాత రాధిక కూడా ఈ షోకు ఎంట్రీ ఇచ్చారు. ఆమెతో కూడా బాలయ్య సరదాగా మాట్లాడి ఫన్ క్రియేట్ చేశారు. చివర్లో 'నాలో నచ్చేది.. చిరంజీవిలో నచ్చనిది ఏంటి' అని ప్రశ్నించి ఆమెను ఇరికించారు.

  English summary
  Nandamuri Balakrishna Did Unstoppable with NBK Show For Aha. Kiran Kumar Reddy Reveals Unknown Facts of YSR Death in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X