7 కోట్ల బడ్జెట్.. 75 కోట్ల వసూళ్లు.. సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ .. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kishkindha Kaandam OTT: మెగాస్టార్ చిరంజీవి అన్నట్లు 'చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలు అని తేడా లేదు. కంటెంట్ బాగుంటే.. ఏ సినిమా అయినా ఆడుతుంది. భారీ సక్సెస్ అవుతుంది. ప్రేక్షకులకు నచ్చేట్లుగా కంటెంట్ ఇవ్వడమే మూవీ మేకర్స్ రెస్పాన్సిబిలిటీ '. ఈ మాటలను నిజమేనని నిరూపించింది. ఓ తక్కువ బడ్జెట్ తో రూపొందించిన మిస్టరీ త్రిల్లర్ మూవీ. ఈ సినిమాను కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఆ మూవీ ఎప్పటినుండి స్రీమింగ్ కాబోతుందంటే?
ఆ మూవీ ఏదో కాదు.. మలయాళం సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ ' కిష్కింద కాండ '. ఈ మూవీని డైరెక్టర్ అయ్యథాన్ డిఫరెంట్ పాయింట్‍తో తెరకెక్కించారు. ఈ మిస్టరీ త్రిల్లర్ మూవీలో ఆసిఫ్ అలీ, విజయ రాఘవన్, అపర్ణా బాలమురళి లు ముఖ్యమైన పాత్రలో నటించగా.. అశోకన్, జగీదీశ్, షెబిన్ బెన్సన్, మాస్టర్ అర్వవ్, వైష్ణవి రాజ్ కీలకపాత్రల్లో కనిపించారు. కోతుల బ్యాక్ డ్రాప్ తో త్రిల్లర్ మూవీ తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రూ.7కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ సినిమా.. ఏకంగా రూ.75 కోట్ల కలెక్షన్లు చేసింది. దీంతో బిగ్ హిట్‍గా నిలిచింది. గుడ్‍విల్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై జాయ్ జార్జ్ తండతిల్ ఈ మూవీని నిర్మించారు.

కిష్కింద కాండ మూవీ విషయానికొస్తే.. అజయన్ (ఆసిఫ్ అలీ), అపర్ణ (అపర్ణ బాలమురళి) లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ, అప్పటికే అజయన్ కి పెళ్లై.. ఓ బాబు కూడా ఉంటాడు. కానీ, తన మొదటి భార్య చనిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. ఆయన రెండో పెళ్లి జరిగిన కొన్ని రోజులకి కొడుకు మాయం అవుతాడు. ఆ కుర్రాడు ఏమైపోయాడు? అజయ్ తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనేది ఈ సినిమా స్టోరీ?
ఈ సినిమా చివరివరకు ఈ ట్విస్ట్ ఇలానే కొనసాగుతూ ఉంటుంది. ఈ మూవీకి 'కిష్కింధకాండ ' అని పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ..
కోతులు ఎక్కువగా ఉండే ఓ ఊర్లో అనూహ్య ఘటనలు జరుగుతాయి. ఇందుకు కారణం ఏంటనే మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఇలా కోతుల బ్యాక్ డ్రాప్ స్టోరీ తో సాగే మూవీపై తెలుగు ప్రేక్షకుల దృష్టి కూడా పడింది. దీంతో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీడీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. అలాంటి మూవీకి ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.

కిష్కింద కాండ మూవీ డిజిటల్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకోంది. ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అందులో మలయాళం తోపాటు తెలుగు, తమిళం ,హిందీ, కన్నడ భాషలలో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ నవంబర్ 17 అంటే నేటి నుండి డిస్నీ హట్ స్టార్ లో ప్రసారం కాబోతుంది.


Click it and Unblock the Notifications











