Kisi Ka Bhai Kisi Ki Jaan OTT: సల్మాన్ ఖాన్ వెంకీ బాలీవుడ్ మూవీ.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ లో స్టార్ హీరోగా సల్మాన్ ఖాన్ కి ఉన్న బ్రాండ్ వేల్యూ ఏంటో అందరికి తెలిసిందే. కరెక్ట్ గా పడితే మొదటి రోజే వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న హీరోగాగా సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఆయన నటించిన ఏక్ ది టైగర్ సీక్వెల్, టైగర్ జిందా హై ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే వీటి తర్వాత చేసిన సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ లోనే కిసికి జాన్ కిసికా భాయ్ మూవీ చేశారు.
తమిళ్ హిట్ మూవీ వీరమ్ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే కథలో కొన్ని మార్పులు చేసి నార్త్ ఇండియా, తెలంగాణ బ్యాక్ డ్రాప్ పెట్టారు. ఇక సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే బ్రదర్ గా వెంకటేష్ పాత్ర ఉంటుంది. ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. సల్మాన్ ఖాన్ కెరియర్ లో ఈ మధ్యాకాలంలో వచ్చిన అతిపెద్ద డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమాని ఒటీటీలో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. జూన్ 23న ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా దీనికి సంబందించిన అఫీషియల్ క్లారిటీ వచ్చింది. అయితే ఇది కేవలం హిందీ భాషలో మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ వెర్షన్ పై ఎలాంటి క్లారిటీ లేదు. చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఫ్లాప్ వచ్చింది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో కలిపి టైగర్ వెర్సస్ పఠాన్ అనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అలాగే టైగర్ జిందా హైకి సీక్వెల్ గా వచ్చే మూవీ ఒకటి చేయనున్నాడు. ఈ రెండు కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లోనే తెరకెక్కనున్నాయి. అయితే వీటిలో దేనిని ముందుగా స్టార్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో గెస్ట్ రోల్ తరహాలో క్లైమాక్స్ కి ముందుగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి పర్సనల్ బాడీ గార్డ్ తరహాలో ఈ పాత్ర ఉంటుంది.


Click it and Unblock the Notifications











