Gangs of Godavari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లంకల రత్న.. ఎప్పుడు అంటే..?
ఈ ఏడాది మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గామి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక అదే జోరుతో ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి నటించగా అంజలి కీలక పాత్రలో నటించింది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎప్పటినుంచో ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మే 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మాస్ కా దాస్ విశ్వక్ ఊర మాస్ అవతార్ లంకల రత్నగా అదరగొట్టాడు. ఈ సినిమాతో పాటు అదే రోజున మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అవే ఆనంద్ దేవరకొండ గంగం గణేశా.. కార్తికేయ భజే వాయువేగం. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్స్ కావడంతో ప్రేక్షకులు అంతగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరంరాలేదు. అయితే ఈ మూడు సినిమాల్లో కార్తికేయ భజే వాయువేగం.. ఫాదర్ సెంటిమెంట్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డబ్బు, అధికారం కోసం ఆశపడే యువకుడు అందరిని తొక్కుకుంటూ,తప్పులు చేస్తూ పైకి ఎదగడం.. భార్య వలన మారడం.. మారాకా మిత్రులే శత్రువులుగా మారి అతడిని చంపాలని చూడడం.. చివరికి హీరో ఏమయ్యాడు.. ? అనేది కథ. అయితే లంకల రత్నగా విశ్వక్ నటనకు పేరు పెట్టడానికి లేదు. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.

ఇక థియేటర్ లో ఒక మోస్తరుగా ఆడుతున్న ఈ సినిమా ఓటిటీ లోకి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పుకొస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ ఆఖరి వారంలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ను చెప్పనున్నారు. మరి థియేటర్ లో సత్తా చూపించలేని లంకల రత్న.. ఓటిటీలోనైనా సందడి చేస్తాడేమో చూడాలి.
ఇక ఈ సినిమా తరువాత విశ్వక్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. గామితో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మరోసారి తన మాస్ అవతారాన్ని చూపించాడు. హిట్ పడకపోయినా.. అతడి నటనకు అయితే మంచి మార్కులే పడ్డాయి. మరి తన తరువాత సినిమాలతో అయినా భారీ విజయాన్ని సెట్ చేస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











