Thangalaan OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి విక్రమ్ మూవీ.. తంగలాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Thangalaan OTT: ఇటీవల భారీ బడ్జెట్ మూవీ అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కొన్ని వారం, రెండు వారాల గ్యాప్‌లో ఓటీటీకి వస్తుంటే.. మరికొన్ని సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా మరో బ్లాక్ బాస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అదే సౌత్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా. ఈ మూవీకి అడ్డంకులు తొలగిపోవడంతో ఎట్టకేలకు తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫీక్స్ అయ్యింది. ఇంతకీ స్రీమింగ్ ఎప్పుడంటే?

తమిళ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్- సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్ కాంబో‌లో తెరకెక్కిన సినిమా 'తంగలాన్'(Thangalaan). పీరియాడికల్ అడ్వెంచెరస్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న వర్డల్ వైడ్ గా విడుదలయ్యింది. ఈ మూవీని 'స్టూడియో గ్రీన్'బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.ఈ మూవీ కోసం సుమారుగా 140 కోట్లు వెచ్చించారు. ఈ మూవీలో హీరో విక్రమ్ కు జంటగా పార్వతి నటించగా, మాళవిక మోహనన్, పశుపతి కీలక పాత్రలో నటించారు.

Kollywood star hero Vikram Thangalan will be available on Netflix starting October 31

ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) బ్యాక్‍డ్రాప్‍లో బ్రిటీష్ పాలన కాలం 1850ల్లో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం నిక్షేపాల అన్వేషణ, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల జీవన పరిస్థితులు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వ పాలన ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు. ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు దర్శకుడు రంజిత్ చూపించారు.

భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టిన తంగలాన్ మోస్తరు కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. ఈ చిత్రానికి దాదాపు రూ.100 గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ బడ్జెట్ కూడా సుమారు రూ.100 కోట్లు అయినట్టు అంచనా. దీంతో కమర్షియల్‍గా ఈ మూవీ సక్సెస్ కాలేకపోయింది. కానీ, చియాన్ విక్రమ్‌ అడ్వెంచరస్‌ యాక్టింగ్‌కు, డైరెక్టర్ పా రంజిత్ టేకింగ్ కు ఫిదా అయిపోయారు మూవీ లవర్స్‌. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరో ప్లస్.

Kollywood star hero Vikram Thangalan will be available on Netflix starting October 31

ఇక ఈ మూవీ ఓటీటీ స్రీమింగ్ విషయానికి వస్తే.. తంగలాన్ మూవీ థియేటర్లలో రిలీజై దాదాపు రెండు పూర్తి అయింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడూ ఓటీటీలోకి వస్తుందని కోట్లాది మంది ప్రేక్షకులు వేయిట్ చేస్తున్నారు. ఇక తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ చేతిలో ఉన్నాయి. అయితే.. తంగలాన్ స్ట్రీమింగ్ ఆలస్యం కావడంతో ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఆర్థిక వివాదాల వల్లే ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదని పుకార్లు వచ్చాయి.

అలాగే.. మేకర్స్, నెట్‍‍ఫ్లిక్స్ మధ్య విభేదాలు వచ్చాయని, ఈ కారణంగానే ఓటీటీ స్టీమింగ్ లేట్ అవుతుందనే ఊహాగానాలు వినిపించాయి.ఆ రూమార్స్ అన్నింటికి చెక్ పెడుతూ.. ఈ మూవీని దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 31 నుంచి నెట్ ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ అవుతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. విక్రమ్ ఐదు డిఫరెంట్ గెటప్‍ల్లో విక్రమ్ తన నట విశ్వరూపం చూపారు. ఈ మూవీని ఇంటిల్లిపాది ఏంజాయ్ చేస్తూ చూసేయండి.

More from Filmibeat

Read more about: vikram thangalaan ott platform
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X