twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    OTT Movies: తెగింపు, వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్స్ ఫిక్స్.. విజయ్ సినిమాకు ఊహించని దెబ్బ!

    |

    ఇటీవల తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సినిమాలలో తెగింపు(తునివు), వారసుడు(వారిసు) టాప్ లిస్టులో నిలిచాయి అని చెప్పవచ్చు. విజయ అజిత్ మధ్యలో తమిళనాడు ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద పోటీ మాములుగా ఉండదు. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే సినిమా విడుదల తేదీలు ఫిక్స్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఊహించిన విధంగా ఒక యుద్ధ వాతావరణంను తలపిస్తున్నారు.

    ఇక రెండు సినిమాలు విడుదలైన తర్వాత టాక్ పరంగా అయితే సమానంగానే రెస్పాన్స్ అందుకున్నారు. రెండు కూడా అదిరిపోయింది అని లెవెల్లో అయితే పాజిటివ్ టాక్ అందుకోలేదు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం గట్టిగానే వచ్చాయి. పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వెనక్కి రావడంతో నిర్మాతలు చాలా వరకు సేఫ్ అయ్యారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓటీపీ డేట్స్ కూడా బయటకు వచ్చేసాయి.

     Kollywood varisu and thunivu movies ott release dates details

    ముందుగా అయితే అజిత్ తెగింపు అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 8 నుంచి ఇది స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తెలియజేసింది. అయితే విజయ్ వారసుడు సినిమా ఓటిటి రిలీజ్ డేట్ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22వ తేదీన ఈ సినిమా రెండు భాషల్లో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    అయితే ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాకముందే HD క్లారిటీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయం చాలా వైరల్ అయిపోయింది. ముందుగానే హై క్వాలిటీ తో పైరసీ చేయడంతో ఒక విధంగా అమెజాన్ ప్రైమ్ కు ఇది గట్టిగా దెబ్బ చూపించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఆ విషయంలో అమెజాన్ ప్రైమ్ చిత్ర యూనిట్ తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరి ఆ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఏదైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

    English summary
    Kollywood varisu and thunivu movies ott release dates details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X