OTTలోకి నాగబాబు సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. "పరువు" హత్య స్టోరీని ఎక్కడ చూడాలంటే?

తెలంగాణలో నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ హత్య తర్వాత అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు దీన్ని ఆధారంగా చేసుకుని వచ్చాయి. ముఖ్యంగా పరవు హత్యలే ప్రధానంగా చూపిస్తూ సరికొత్త చిత్రాలు రాగా.. తాజాగా మరో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇలాంటి అంశంతోనే రూపొందింది. అయితే అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొణిదెల నాగబాబు, నరేష్ అగస్త్య, నివేదా పేతురాజ్ లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ యే పరువు. పరువు హత్యల ప్రధాన అంశంగా తీసుకుని రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో... రమేష్, సునీల్ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్, రాజ్ కుమార్ కసిరెడ్డి, మొయిన్, అమిత్ త్వారి, అనిల్ తేజ, బిందు చంద్రమౌళి, అఖిలేష్, బోస్ అన్నయ్య, రవితేజ మహదాస్యం, మాధవి, సంతోష్ నందివాడలు నటించారు. అయిదే ఈ వెబ్ సిరీస్ ను చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలతో పాటు, విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టిలు నిర్మించారు.

Konidela Nagababu And Nivetha Pethuraj Crime Thriller Web Series Paruvu OTT Streaming Details Here

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించిన ఈ పరువు వెబ్ సిరీస్ కు.. శరణ్య పోట్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అలాగే సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకుడిగా పని చేశారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించగా.. విప్లవ్ ఎడిటర్ గా పని చేశారు. చింతా విద్యా సాగర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. అదిరిపోయే కథాంశంతో ఏ వెబ్ సిరీస్ ను నిర్మించారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను మెగి ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల కాబోతుందో కూడా ప్రకటించారు.

Konidela Nagababu And Nivetha Pethuraj Crime Thriller Web Series Paruvu OTT Streaming Details Here

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 వేదికగా ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పరువును జూన్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎక్స్ వేదికగా జీ5 సంస్థ నేరుగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఎన్నో రోజుల తర్వాత నాగబాబు ప్రధాన పాత్రలో నటించి ఈ వెబ్ సిరీస్ ను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూసి పుల్ గా ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ దిస్ క్రేజీ వెబ్ సిరీస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X