OTT: ఓటీటీలో కొరియన్ హారర్ థ్రిల్లర్ సెన్సేషన్.. తెలుగులో ఏ ఓటిటిలో చూడొచ్చంటే?
జస్ట్ గడిచిన కొన్నేళ్ల లోనే ప్రపంచ వ్యాప్తంగా ఓటిటిల వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా వరల్డ్ వైడ్ గా పాపులర్ స్ట్రీమింగ్ సంస్థల్లో అనేక భాషల్లో కంటెంట్ ఇప్పుడు అందుబాటులోకి ఉంటుంది. ఒకప్పుడు అంటే పలు చిత్రాలు అది కూడా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ఇతర భాషల్లో డబ్బింగ్ అయ్యి థియేటర్లులో రిలీజ్ అయితే తప్ప చూసే పరిస్థితి లేదు.
కానీ ఎప్పుడైతే ఓటిటిలు ఊపందుకున్నాయి ప్రపంచ కంటెంట్ వచ్చేసింది. ఇలా ఎన్నో భాషలకి చెందిన కంటెంట్ ఎన్నో దేశాల తరపున వచ్చి పలు ఓటిటి యాప్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే చాలా భాషలు ఉన్నప్పటికీ కొరియన్ కంటెంట్ కి ఉన్న క్రేజ్ ఓటిటి ఆడియెన్స్ లో వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

ఇలా సౌత్ కొరియన్ నుంచి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు భాషతో సంబంధం లేకుండా చూడటం మొదలు పెట్టారు. కాగా కొరియన్ నుంచి అనేక జానర్స్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే హారర్ జానర్ లో రీసెంట్ గా సంచలనం రేపిన సినిమా ఏదన్నా ఉంది ఆటే అది "ఎక్స్హుమా" అని చెప్పాలి. ఈ చిత్రం సౌత్ కొరియాలో సంచలన విజయం సాధించింది.
అంతే కాకుండా మన దేశంలో కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కానీ చాలా తక్కువమందే చూసారు. అయినప్పటికీ చూసినవారు అంతా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో లేపుతూ వచ్చారు. దీనితో అలా మిగతా వారికీ కూడా ఈ సినిమా ఏంటి అసలు అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాగా అప్పటికి ఈ చిత్రం ఇంకా ఏ ఓటిటిలో కూడా రాలేదు.

ఒకవేళ ప్రైవేట్ గా వచ్చినప్పటికీ తెలుగులో అందుబాటులో లేదు. కాగా ఇప్పుడు ఫైనల్ గా ఈ క్రేజీ హారర్ థ్రిల్లర్ ఓటిటిలో అది కూడా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. కాగా ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పాన్ వరల్డ్ భాషల్లో తీసుకొచ్చారు. అందులో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది.
మరి ఇందులో కొందరు దయ్యాలని వదిలించే మాంత్రికులు వారికి జపాన్ కి చెందిన ఓ క్రూరమైన దయ్యం కేసు సాల్వ్ చేయాల్సిన సవాలు ఎదురవుతుంది. మరి ఆ దయ్యం ఏం చేస్తుంది? ఎన్నో కేసులు సాల్వ్ చేసిన వీరు ఈ దయ్యాన్ని ఎలా ఎదుర్కొంటారు? చివరికి ఏమయ్యింది అనే అంశాలు అలా స్లోగా తీసుకెళ్తూ మంచి హారర్ ట్రీట్ ని అందిస్తుంది.
కాగా మరికొన్ని సీన్స్ అయితే భయపెట్టేలా ఇంకొన్ని డిస్టబింగ్ గా కూడా అనిపిస్తాయి. మరి ఈ సినిమాని జాంగ్ జీ హ్యూన్ దర్శకత్వం వహించగా చోయ్ మిన్ సిక్, కిమ్ గో యూన్ తదితరులు నటించారు. మరి మనవాళ్ళు సోషల్ మీడియాలో అంత లేపిన ఈ సినిమాని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఇప్పుడు ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications