Kota Bommali OTT: ఓటీటీలోకి కోటబొమ్మాళి పీఎస్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
హీరో మేక శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ లు ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం కోటబొమ్మాళి. ఈరోజే ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల అయింది. ఈ చిత్రం శివాని రాజశేఖర్ తో పాటు రాహుల్ విజయ్ కూడా కీలక పాత్రలో నటించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన నయట్టు చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహించగా... గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు.
అలాగే ఈ చిత్రానికి ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం అందించగా.. జగదీశ్ చీకటి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా చాలా బాగుందనే టాక్ కూడా నడుస్తోంది. హీరోహీరోయిన్లతో పాటు మురళీ శర్మ, దయానంద రెడ్డిలు యాక్టింగ్ ఇరగదీశారట. ఎక్కడా సినిమాపై బోర్ కొట్టకుండా బాగా తెరకెక్కించారని అంటున్నారు.

అయితే సినిమా విడుదల అయిన ఈరోజే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రం ఏ ప్లాట్ ఫారమ్ లో రాబోతుందో తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన ఆహా వేదికగా ఈ చిత్రం విడుదల కాబోతుందట. సినిమా టాక్ బాగా వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేస్తే ఈ సినిమా కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుందని.. లేదంటే మాత్రం నెల పూర్తికాక ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.
ఈ మధ్య చాలా చిత్రాలు నెర రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. టాక్ బాగుండి, హిట్టుగా నిలిస్తే మాత్రమే కాస్త ఆలస్యం చేస్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనేది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ లతో పాటు... పాటలకు విపరీతమైన స్పందన వచ్చింది. లింగి లింగి లింగిడి.. అంటూ వచ్చిన పాట అయితే నెట్టింటిని షేక్ చేసింది. ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపించింది. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉండడం గమనార్హం.
కోటబొమ్మాళి పీఎస్ తో పాటు పంజా వైష్ణవ్ తేజ్, టాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోహీరోయిన్లుగా చేసిన ఆదికేశ సినిమా కూడా ఈరోజే విడుదల అయింది. మరి ఈ సినిమా పోటీని తట్టుకొని కోబొమ్మాళి చిత్రం హిట్టుగా నిలుస్తుందా, బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తుందో తెలియాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











