ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. అసలు సర్‌ప్రైజ్ ఏంటంటే!
మిగిలిన భాషల మాదిరిగానే తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్‌లో సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. వాటికి ప్రేక్షకులు మంచి స్పందనను అందించడంతో దర్శక నిర్మాతలు అదే తరహాలో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే అలా ఆడియెన్స్ ముందుకు వచ్చిన సినిమానే 'కోటబొమ్మాళి పీఎస్'.
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీనే 'కోటబొమ్మాళి పీఎస్'. తేజ మర్ని తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు మంచి స్పందనను అందించారు. ఫలితంగా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించి విజయాన్ని కూడా అందుకుంది.

పాజిటివ్ టాక్ ఉన్నా థియేటర్లలో కొద్ది రోజుల పాటే సందడి చేసిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించి మంచి పోటీనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు సదరు సంస్థ మంచి మొత్తాన్ని కూడా ముట్టజెప్పినట్లు ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ చిత్రం నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దీన్ని జనవరి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా సంస్థ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
ముందుగా ప్రకటించినట్లుగానే 'కోటబొమ్మాళి పీఎస్' మూవీని నేటి (జనవరి 11వ తేదీ) నుంచే ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చేసింది. ఇందులో థియేటర్ వెర్షన్ కాకుండా సెన్సార్ బోర్డుకు వెళ్లని కాపీని తీసుకు వచ్చినట్లు తెలిసింది. అంటే సెన్సార్ సమయంలో కట్ అయిన డైలాగులు, సన్నివేశాలను ఇందులో యాడ్ చేశారని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాను బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళి శర్మ, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











