Unstoppable 2: ఫుల్ బాటిల్ లేపేశారా అన్న క్రిష్.. కోపంగా బాలకృష్ణ.. పవన్ ఏమో అలా!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పూనకాలు మొదలవుతాయి. అంతలా ఆయన అభిమానలను సంపాదించుకున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి తెరగేంట్రం చేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్ తనదైన శైలీలో ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన స్పెషల్ గెస్ట్ గా హాజరైన నందమూరి నటసింహం బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ రెండో సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో రెండో పార్టుకు సంబంధించిన స్పెషల్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

పవర్ ఫినాలే ఎపిసోడ్..

పవర్ ఫినాలే ఎపిసోడ్..

నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిచిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ నేటితో అంటే ఫిబ్రవరి 9తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పూర్తి కానుంది. అన్ స్టాపబుల్ రెండీ సీజన్ పవర్ ఫినాలే ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

మూడు పెళ్లిళ్లపై పవన్..

మూడు పెళ్లిళ్లపై పవన్..

పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మొదటి పార్టును ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు ప్రసారం చేయగా.. దానికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ మొదటి సారి ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా కలుసుకున్నారో తెలిపారు. మూడు పెళ్లిళ్లు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చారు. అసలు సుస్వాగతం మూవీ తర్వాత సినిమాలు ఎందుకు చేయనని అన్నారు, పవన్ ఫామ్ హౌజ్, త్రివిక్రమ్ కథ చెప్పడం గురించి పలు ఆసక్తికర అంశాలను చర్చించారు.

అతి తక్కువ సమయంలో..

అతి తక్కువ సమయంలో..

ఇలాంటి అనేక ఇంట్రెస్టెంగ్ ఎలిమెంట్స్ తో అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ ఫినాలే ఎపిసోడ్ బీభత్సంగా దూసుకుపోయింది. ఇంతకుముందు వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ ఒక లెక్కగా ఇప్పుడు తాజాగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మరొ లెక్క అన్నట్లుగా మారింది. మహేశ్ బాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ కు మించిన రెస్పాన్స్ పనన్ కల్యాణ్ ఎపిసోడ్ కు వస్తోందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అతి తక్కువ సమయంలో 100 మిలియిన్ వ్యూస్ దాటిన ఎపిసోడ్ గా పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మొదటి పార్ట్ నమోదు చేసిందని ఆహా వర్గాలు వెల్లడించాయి.

దానికంటే ఒకరోజు ముందుగా..

దానికంటే ఒకరోజు ముందుగా..

ఇటీవలే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ రెండో పార్టు ప్రోమోను విడుదల చేశారు. అందులో కూడా అనేక అంశాలను చర్చించారు. రాజకీయాలు, మేనిఫెస్టో, పవన్ కల్యాణ్ పై అటెంప్ట్ మర్డర్ కేసు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు, టీడీపీలోకి చేరి ఉండాల్సింది అని బాలకృష్ణ అనడం వంటివి క్యూరియాసిటీ పెంచేశాయి. అయితే ఈ రెండో పార్టును మొదటగా ఫిబ్రవరి 10న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దానికంటే ఒక రోజు ముందు అంటే గురువారం రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రెండో పార్టు స్పెషల్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ఇద్దరికీ డిఫరెన్స్ ఏంటీ..

ఇద్దరికీ డిఫరెన్స్ ఏంటీ..

అన్ స్టాపబుల్ రెండో సీజన్ పవన్ కల్యాణ్ పవర్ ఫినాలే ఎపిసోడ్ రెండో పార్టుకు సంబంధించిన స్పెషల్ ప్రోమోలో హరి హర వీరమల్లు మూవీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మా ఇద్దరితో పని చేశావ్ కదమ్మా.. డిఫరెన్స్ ఏంటీ అని బాలకృష్ణ అడిగారు. ఒక సింహం.. ఒక పులి మధ్యలో నా తల ఉంది సార్ అని క్రిష్ చెప్పారు. తర్వాత త్రివిక్రమ్ గారు ఎందుకు తప్పించుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అని డైరెక్టర్ క్రిష్ అందరినీ నవ్వించారు.

ఫుల్ బాటిల్ తాగేశారా..

ఎవరైనా కథను నారేషన్ చేస్తున్నప్పుడు నిద్ర పోయారా అని ఇద్దరినీ ప్రశ్నించారు క్రిష్ జాగర్లమూడి. దానికి రావచ్చా అని నవ్వుతూ ఒక అడుగు ముందుకు వేశారు పవన్ కల్యాణ్. దీంతో ప్రోగ్రామ్ లో నవ్వులు, అరుపులు ఎక్కువయ్యాయి. తర్వాత సోఫాలో కూర్చుని రిలాక్స్ డ్ గా నన్ను నిద్ర పుచ్చిన డైరెక్టర్ ఎవరో అని ఆలోచించారు బాలకృష్ణ. అనంతరం ఎప్పుడైనా ఫుల్ బాటిల్ తాగేసారా అని దర్శకులు క్రిష్ జాగర్లమూడి అడిగారు. దీంతో బాలకృష్ణ సీరియస్ గా చూస్తే.. పవన్ కల్యాణ్ నవ్వుతూ బాలయ్యను చూశారు. ఇలా ప్రోమోను ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X