Rangamarthanda OTT రైట్స్ కు భారీ ధర.. ఫ్యాన్సీ రేటుతో సొంతం.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
విభిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణవంశీ. ఆయన సినిమాల్లో సహజత్వం ఉంటుంది. భావోద్వేగాలకు పెద్ద పీట వేసి సినిమాను తెరకెక్కిస్తుంటారు. అలా నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ వంటి కుటంబకథా చిత్రాలు తీసిన ఆయన గులాబీ, సింధూరం, అంతఃపురం వంటి వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే రాఖీ, చక్రం వంటి మెసేజ్ ఒరియెంటెడ్ చితాలను సైతం తెరకెక్కించారు. ఆయన తాజాగా దర్శకత్వం చేసిన మూవీ 'రంగమార్తాండ'. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం 'రంగమార్తాండ'. మరాఠి సూపర్ హిట్ మూవీ నట సామ్రాట్ కు రీమెక్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శివగామి రమ్యకృష్ణ, కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్, హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే విడుదలైంది.

ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన 'రంగమార్తాండ' సినిమా ఉగాది పండుగ కానుకగా అంటే మార్చి 22న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వస్తోంది. అందుకు తగినట్లుగానే రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది ఈ చిత్రం. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డే నుంచి కలెక్షన్లు వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మంచి రెస్పాన్స్ వస్తున్న కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా డిజిటల్ రైట్స్ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటు చెల్లించి మరి హక్కులు సొంతం చేసుకుందని సమాచారం. ఇక ఈ సినిమాను విడుదలైన 4 లేదా 5 వారాల తర్వాత ఓటీటీలో అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడకపోయిన దాదాపుగా థియేటర్ల తర్వాత నాలుగైదు వారాల్లో ఓటీటీలో విడుదల చేస్తారన్న విషయం తెలిసిందే.

అయితే బ్రహ్మానందం కీలక పాత్ర పోషించిన కృష్ణవంశీ డైరెక్టెడ్ మూవీ రంగమార్తాండ ఓటీటీ హక్కులతోనే 90 శాతం రికవరీ సాధించినట్లు టాక్. ఇంకా డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ మిగిలే ఉన్నాయి. సినిమా సక్సెస్ అయితే అటు థియేట్రికల్ పరంగా, అటు నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా నిర్మాతలకు మరింత లాభాలు చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











