Ranga Maarthaanda: OTTలో రంగమార్తాండ అరుదైన రికార్డ్.. ప్రేక్షకుల నీరాజనాలు
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా దర్శకత్వం వహించిన మూవీ 'రంగమార్తాండ'. మరాఠీ భాషలో మంచి హిట్ అందుకున్న నట సామ్రాట్ సినిమాకు రీమెక్ గా వచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనేన ఉగాది పండుగ కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఓటీటీలో ప్రత్యక్షమైన ఈ మూవీ అంతకుమించి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఫలితంగా రికార్డ్ క్రియేట్ చేసింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శివగామి రమ్యకృష్ణ, కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్, హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ ఫేమ్ ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడమే కాకుండా నటీనటుల యాక్టింగ్ కన్నీళ్లు పెట్టించిందని ప్రశంసలు దక్కాయి.

అయితే సినిమాకు మంచి టాక్ ఉన్నప్పటికీ వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయంది 'రంగమార్తాండ' మూవీ. దీంతో 4, 5 వారాల్లో ఓటీటీలోకి రావాల్సిన ఈ సినిమాను 14 రోజులకే రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఏప్రిల్ 7న విడుదలైన ఈ సినిమా అదరగొడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రంగమార్తాండ మూవీ అరుదైన రికార్డ్ అందుకుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఉన్న టాప్ 10 సినిమాల విభాగంలో రంగమార్తాండ సినిమా మొదటి స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో పెద్దగా కాసుల వర్షం కురవకపోయినా ఓటీటీల్లో మాత్రం అత్యంత ఎక్కువగా ప్రేక్షాకదరణ పొందడం విశేషంగా మారింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధించలేక ఓటీటీలో సత్తా చాటిన చిత్రాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది రంగమార్తాండ. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటన అద్బుతం అంటూ కొనియాడుతున్నారు.
రంగామార్తాండ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు అందరూ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని చిరంజీవి కితాబు ఇచ్చారు. డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి ఇలాంటి ఒక మూవీ వచ్చి చాలా కాలం కావడంతో ప్రేక్షకులు సైతం ఆదరిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని హౌజ్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











