Rangamarthanda OTTలో ప్రత్యక్షమైన రంగమార్తాండ.. 14 రోజులకే.. ఇదే ఉత్తమం అంటూ!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం 'రంగమార్తాండ'. మరాఠి సూపర్ హిట్ మూవీ నట సామ్రాట్ కు రీమెక్ గా తెరకెక్కింది. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన 'రంగమార్తాండ' సినిమా ఉగాది పండుగ కానుకగా అంటే మార్చి 22న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ లభించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
విలక్షణ దర్శకుడు చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శివగామి రమ్యకృష్ణ, కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం, బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్, హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డే నుంచి కలెక్షన్స్ రాబట్టింది.

అయితే తర్వాత కొద్దిరోజులకు రంగామార్తాండ సినిమాకు కలెక్షన్స్ తగ్గాయి. ఊహించినదానికంటే భిన్నంగా ప్రేక్షకులు థియేటర్లలోకి రాలేదు. ఆన్ లైన్ లో జరిగిన ప్రచారానికి బాక్సాఫీస్ వద్ద నమోదైన వసూళ్లకు పొంతన లేకుండా పోయింది. మొదట రెండు మూడు రోజులు హడావిడి కనిపించినా తర్వాత పెద్దగా ఒరిగింది లేదు. అయితే ఈ సినిమాను దాని మార్కెట్ కు మించిన భారీ మొత్తాన్ని చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిందట.
ఇక రంగమార్తాండ సినిమాను విడుదలైన తర్వాత 4, 5 వారాలకు ఓటీటీలో రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా చడీ చప్పుడు లేకుండా ఏప్రిల్ 7 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలు పెట్టేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ సినిమాకు థియేట్రికల్ కంటే ఓటీటీ రైట్స్ ద్వారా పెట్టిన బడ్జెట్ ఎప్పుడో వచ్చిందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో ఎవరూ చూడకపోయేసరికి ఓటీటీలోకి వదిలారు.
ఇలా 14 రోజులకు ఓటీటీలకు రావడం మంచి నిర్ణయమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అధికా శాతం ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుందని, ఆసక్తి తగ్గిపోయేవరకు ఆలస్యం చేయకుండా ఇదే బెటర్ అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











