Krishna Vrinda Vihari OTT: ఆ ఓటీటీలో నాగశౌర్య మూవీ.. కరెక్టుగా అదే రోజున స్ట్రీమింగ్
స్వయంకృషితోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలోనే లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య. దీనికితోడు హీరోగా ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీగానే పెంచుకున్నాడు. తద్వారా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకున్న నాగశౌర్య.. విభిన్నమైన కాన్సెప్టులతో వస్తున్నాడు. దీంతో మంచి ఫలితాలను అందుకుంటున్నాడు.
ఇప్పటికే ఈ ఏడాది పలు చిత్రాలతో సందడి చేసిన నాగశౌర్య ఇటీవలే 'కృష్ణ వ్రిందా విహారి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకున్న చిత్రం కావడంతో ఇది ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి వీకెండ్ ఈ చిత్రానికి కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ, క్రమంగా వసూళ్లు పడిపోతూ వచ్చాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే ఫుల్ రన్‌ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మంచి టాక్ ఉన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయిన 'కృష్ణ వ్రిందా విహారి' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చాలా రకలా వార్తలు వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు, ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. దీన్ని అక్టోబర్ 23వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా వెలువడింది. అంటే.. ఈ సినిమా విడుదలైన నెల రోజులకే స్ట్రీమింగ్ కాబోతుందన్న మాట.
ఇదిలా ఉండగా.. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ తీసిన చిత్రమే 'కృష్ణ వ్రిందా విహారి'. ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్యలు నటించారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











