ఓటీటీలోకి కృతిసనన్, కాజల్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్.. రాఘవేంద్రరావు మాజీ కోడలు మూవీ ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చంటే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్, యువ రచయిత, దర్శకురాలు కనికా ధిల్లాన్ నిర్మాతలుగా మారి తెరకెక్కించిన చిత్రం దో పత్తి (Do Patti). యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యువ డైరెక్టర్ శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కథా పిక్చర్స్, బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ సంయుక్తంగా నిరిస్తున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నది. ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ? రిలీజ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే..
ఎన్నో చిత్రాల్లో తనదైన మార్కుతో నటించి మెప్పించిన హీరోయిన్ కృతిసనన్ తొలిసారి నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. తన అభిరుచికి తగినట్టుగా హీరోయిన్స్‌కు ఫెర్ఫార్మెన్స్‌కు చోటు ఉండే కథలను ఎంచుకోవాలనే ఉద్దేశంతో బటర్‌ఫ్లై ఫిల్మ్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించారు. యువ రచయిత కనిక థిల్లాన్‌ను కూడా నిర్మాతగా మార్చారు.

ఇన్వెస్టిగేటివ్ డ్రామా, ఎమోషనల్ లవ్ స్టోరీ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో ఇన్స్‌పెక్టర్ విద్యా జ్యోతి కన్వర్‌గా కాజోల్ కనిపించారు. ఒకే అబ్బాయితో ప్రేమలో పడిన సౌమ్య, శైలీ సూద్ అనే కవలలుగా కృతి సనన్ నటించారు. షాహీర్ షేక్, తన్వీ ఆజ్మీ, బ్రిజేంద్ర కాల, వివేక్ ముష్రాన్, ప్రాచీ షా పాండ్యా తదితరులు ఈ వెబ్ మూవీలో నటించారు.
ఇటీవల విడుదల చేసిన దో పత్తి ట్రైలర్ విషయానికి వస్తే.. సౌమ్య, శైలి లవర్‌ను విచారిస్తూ ఇన్స్‌పెక్టర్ విద్యా కనిపించింది. అంటే మిస్టరీ ఈ కథలో చోటు చేసుకొన్నది. ఆ మిస్టరీని బయటకు లాగేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిందనే విషయం అర్దమైంది. ఇక ఈ ట్రైలర్‌లో ఒక ఆడదాని కోసం మహాభారత యుద్దం జరిగిందని విన్నాం. కానీ ఇద్దరు ఆడవాళ్లు ఒక మగవాడి కోసం యుద్దం చేస్తున్నారే అనే లీడ్ మాత్రం ఇచ్చేసి అంచనాలు పెంచారు.

దో పత్తి సినిమాను థియేట్రికల్‌గా కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ వెబ్ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ అక్టోబర్ 28వ తేదీన గ్రాండ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే కాజల్, కృతి సనన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా కనిక థిల్లాన్ విషయానికి వస్తే.. తెలుగు వారికి పరిచయమైన పేరే. అనుష్క శెట్టి నటించిన సైజ్ జీరో సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. అలాగే షారుక్ ఖాన్ చిత్రం ఓం శాంతి ఓం, రా.వన్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేశారు. అంతేకాకుండా జడ్జిమెంటల్ హై క్యా, హసీన్ దిల్‌రుబా, కేదారినాథ్, మన్మర్జియాన్ సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేశారు.
ఇలాంటి టాలెంట్ ఉన్న కనిక.. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు మాజీ కోడలు. ఆయన కుమారుడు ప్రకాశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అభిప్రాయబేధాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలపై ఫోకస్ పెట్టింది. దో పత్తి సినిమాకు నిర్మాతగా మారడం విశేషంగా చెప్పుకోవాల్సిందే.


Click it and Unblock the Notifications











