Kuberaa: ముందుగానే ఓటీటీలోకి కుబేర.. ధనుష్- నాగార్జునల మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథనాయకుడు అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన చిత్రం కుబేర. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా కుబేర చిత్రాన్ని నిర్మించారు. జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్‌లు ఎడిటర్‌గా వ్యవహరించగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ వివరాల్లోకి వెళితే..

కుబేర బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ ఎంత?
పాన్ ఇండియా సినిమా కావడంతో నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా కుబేరాను నిర్మించారు. రియల్ ఫిలింగ్ రావడానికి ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని రియల్ లొకేషన్స్‌లో కుబేర సినిమా చిత్రీకరణ జరిగింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కుబేర సినిమాకు రూ.120 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున, ధనుష్, రష్మికల కాంబినేషన్‌తోపాటు టీజర్, ట్రైలర్‌లు కుబేరపై అంచనాలను పెంచేశాయి. తమిళ, తెలుగు మార్కెట్స్‌లో కుబేర థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో రూ.40 కోట్లు, ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5 కోట్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా రూ.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కుబేర. 66 కోట్ల రూపాయల షేర్.. 132 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్‌గా కుబేర బాక్సాఫీస్ వద్ద జర్నీని ప్రారంభించింది.

Kuberaa OTT Release Akkineni Nagarjuna and Dhanush s movie lock its online streaming date

తెలుగు రాష్ట్రాల్లో కుబేర వసూళ్లు
21 రోజుల వరకు నైజాంలో 17.72 కోట్ల రూపాయలు , సీడెడ్‌లో 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.24 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరిలో 1.80 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.50 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2.40 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.30 కోట్ల రూపాయల చొప్పున ఆంధ్రా, నైజాంలలో కుబేరకు నికరంగా 40 కోట్ల రూపాయల నెట్.. 67 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

తెలుగేతర రాష్ట్రాల్లో కుబేర వసూళ్ల విషయానికి వస్తే.. 21 రోజుల వరకు తమిళనాడులో 20.47 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 13.05 కోట్ల రూపాయలు, కేరళలో 1.25 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 21 రోజుల వరకు ఇండియాలో కుబేరాకు 88 కోట్ల రూపాయల నెట్, 103.21 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు కుబేరకు 31.4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలోని గ్రాస్‌ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుని ధనుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల రూపాయలు రాబట్టింది.

కుబేర ఏ ఓటీటీలో?
కుబేరా మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దాదాపు రూ.50 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. థియేటర్‌లో విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ చేసేలా ఒప్పందం కుదిరింది. అయితే నెల తిరక్కుండానే కుబేరా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. తాజాగా దీనిపై అమెజాన్ ప్రైమ్ కీలక ప్రకటన చేసింది. జూలై 18 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కుబేర అందుబాటులో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. థియేటర్‌లో హిట్‌గా నిలిచిన కుబేర.. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X