Kuberaa OTT Release: ఓటీటీలోకి కుబేర .. ధనుష్- నాగార్జునల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన చిత్రం కుబేర. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అప్పుడే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం గురించి చర్చ మొదలైంది. కుబేర ఏ ఓటీటీలో ఎప్పుడు? రిలీజ్ అవుతుందంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
భారీ తారాగణం
అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ కుబేర చిత్రాన్ని నిర్మించారు. జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. హైదరాబాద్, ముంబై, చెన్నైలలో నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలు, టీజర్, ట్రైలర్లు ఈ కుబేర సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

భారీ బడ్జెట్‌తో కుబేర
పాన్ ఇండియా సినిమా కావడంతో దానికి తగిన హంగుల కోసం నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా కుబేరాను నిర్మించారు. హిందీ నటులతో పాటు పలు రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కుబేర సినిమాకు రూ.120 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున, ధనుష్ తొలిసారి కలిసి నటించడంతో పాటు శేఖర్ కమ్ముల రోటీన్‌కు భిన్నంగా పొలిటికల్, క్రైమ్ యాంగిల్ టచ్ చేయడంతో కుబేరపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కోలీవుడ్‌లో డల్‌గా బిజినెస్
తమిళ, తెలుగు మార్కెట్స్‌లో థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో రూ.40 కోట్లు, ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5 కోట్లు చొప్పున మొత్తంగా రూ.65 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కుబేర. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 66 కోట్ల షేర్.. రూ. 132 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైనప్పటికీ ఆశ్చర్యకరంగా తమిళంలో కుబేరకు చెప్పుకోదగ్గ బిజినెస్ జరగకపోవడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ బాగానే జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కుబేరా టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతించింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. పది రోజుల పాటు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది.
కుబేర ఏ ఓటీటీలో అంటే?
ఇదిలాఉండగా.. ఈ సినిమా ఓటీటీ గురించి అంతా డిస్కషన్ నడుస్తోంది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న వంటి స్టార్ క్యాస్టింగ్ నేపథ్యంలో కుబేర డిజిటల్ రైట్స్‌కు మంచి గిరాకీ ఏర్పడింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దాదాపు రూ.50 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ధనుష్, నాగార్జునల కెరీర్‌లోనే ఇది అత్యధికమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాలనే ఒప్పందం మీద ప్రస్తుతం ఓటీటీ డీల్స్ జరుగుతున్న నేపథ్యంలో కుబేరను జూలై చివరి వారంలో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ రన్‌ను కుబేర ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం కావొచ్చు.. ముందుగానే ఓటీటీలోకి రావొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











