L2 : Empuraan OTT : నెల తిరక్కుండానే ఓటీటీలోకి ఎల్ 2 : ఎంపురాన్ .. మోహన్‌లాల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ , స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన చిత్రం ఎల్ 2: ఎంపురాన్. రెండేళ్ల క్రితం వచ్చిన సూపర్‌హిట్ మూవీ లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ సినిమా .. థియేటర్‌లో రిలీజై నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేందు సిద్ధమైంది? ఈ నేపథ్యంలో ఎల్ 2 : ఎంపురాన్ ఏ ఓటీటీలో ఎప్పడు? స్ట్రీమింగ్ కానుందో చూస్తే:

ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత ( L2: Empuraan Budget)?
ఎల్ 2 : ఎంపురాన్‌లో అభిమన్యు సింగ్, మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, సాయికుమార్, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దీపక్ దేవ్ స్వరాలు సమకూర్చగా.. సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ అందించారు. లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. దీనికి తగినట్లుగానే హై స్టాండర్డ్స్ రావడం కోసం ఎల్ 2 : ఎంపురాన్‌కు భారీగానే ఖర్చు చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా ఎల్ 2 : ఎంపురాన్‌కు దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్ అయ్యిందని మలయాళ ఇండస్ట్రీ టాక్.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (L2: Empuraan Break Even Target)?
మలయాళ చిత్ర పరిశ్రమలో గతంలో ఏ సినిమాకు లేనివిధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల వ్యాపారం జరిగింది. ఎల్ 2 : ఎంపురాన్ లాభాల్లోకి రావాలంటే రూ.110 కోట్ల షేర్ .. రూ. 220 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
ఎల్ 2 : ఎంపురాన్ కలెక్సన్స్ (L2: Empuraan Collections)
టీజర్, ట్రైలర్లు, పాజిటివ్ రివ్యూలతో హిట్ టాక్ తెచ్చుకున్న ఎల్ 2 : ఎంపురాన్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. రెండ్రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మోహన్ లాల్ చిత్రం 21 రోజుల వరకు ఇండియాలో రూ.105.43 కోట్ల నెట్, రూ.123.39 కోట్ల గ్రాస్ రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.142.05 కోట్లతో కలిపి ఇప్పటి వరకు ఎల్ 2 ఎంపురాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.265.44 కోట్ల ఆర్జించినట్లు సాక్ నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది. 21 రోజుల వరకు మలయాళంలో రూ.96.19 కోట్ల నెట్, కన్నడంలో రూ.27 లక్షల నెట్, తెలుగులో రూ.2.6 కోట్ల నెట్, తమిళంలో రూ.3.95 కోట్ల నెట్, హిందీలో రూ.2.42 కోట్ల నెట్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.
ఎల్ 2 : ఎంపురాన్ ఓటీటీ ఫ్లాట్‌ఫాం.. స్ట్రీమింగ్ డేట్ (L2: Empuraan Ott Release date)
ఎల్ 2 : ఎంపురాన్‌ను ఓటీటీలో చూసేందుకు ఆ సెక్షన్ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మోహన్ లాల్ చిత్రం ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం జియో హాట్ స్టార్ కళ్లు చెదిరే ధరకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుందని హాట్ స్టార్ తెలిపింది. అయితే నెల తిరక్కుండానే ఎంపురాన్ ఓటీటీలోకి రావడంపై మోహన్ లాల్ అభిమానులు షాక్ అవుతున్నారు. థియేటర్‌లో హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











