Nayanthara: నయన్ డాక్యుమెంట‌రీ స్ట్రీమింగ్ కు సిద్దం.. పెళ్లి మాత్రమే కాదు.. అంతకు మించి.. ఎప్పుడంటే..?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార.. చాలా తక్కువ సమయంలో సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధికంగా పారిదోషకం తీసుకుంటున్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు నయనతార. అయితే నయనతార పర్సనల్,ప్రొఫెషనల్ లైఫ్ లో చోటు చేసుకున్న ఇంపార్టెంట్ మూమెంట్స్ పై డాక్యుమెంట్ రూపొందించారు. ఈ డాక్యుమెంట్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్ విడుదలకు సిద్ధం గా ఉంది. ఇంతకీ లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంట్ స్ట్రీమింగ్ ఎప్పటినుండి కానున్నదంటే ?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. నయనతార తన కెరీర్ ను మోడలింగ్ తో ప్రారంభించింది. ఇందులో రాణించడంతో ఆమెకు సినిమా ఆఫర్ వచ్చాయి. మొదట్లో ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింది కూడా.. ఈ తరువాత మలయాళీ దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే'మూవీలో నటించి తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి మూవీ హిట్ కావడంత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో నయనతారకు స్మయతుంబట్టు, రాప్పకల్, తస్కర వీరన్, వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది.

Lady Superstar Nayantara documentary Nayantara Beyond the Fairy Tale will be streaming on November 18 on netflix

ఈ తరుతరువాత టాలీవుడ్ లో అడుగుపెట్టి.. చంద్రముఖి, గజిని, లక్ష్మీ, దుబాయ్ శీను, లక్ష్మీ, బాస్, శివాజీ, తులసి, అదుర్స్, అనామిక, బాబు బంగారం, అమ్మోరు తల్లి, పెద్దన్న, గాడ్ ఫాదర్, ఓ2 వంటి క్రేజీ సినిమాల్లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో నటించింది. ఇలా తన అందం, అభినయంతో సౌత్ ప్రేక్షకులను మెస్మారైజ్ చేసింది. వరుస సక్సెస్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
తెలుగు శ్రీరామరాజ్యంలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. శ్రీరామరాజ్యం చిత్రానికి నయనతారకు ఏకంగా ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు కూడా దక్కాయి.

ఇక నయన్ వ్యక్తిగత విషయాలు చూసినట్లైతే..వల్లభన్ షూటింగ్ క్రమంలో తోటి నటుడు శింబుతో లవ్ లో పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, వ్యతిగత కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారట. తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో ప్రేమలో పడిందని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వీరి వార్తలు పెద్ద దుమారమే రేపాయి. ఏమైందో తెలియదు. కానీ..ప్రభుదేవా అండ్ నయనతార కూడా విడిపోయారు.

Lady Superstar Nayantara documentary Nayantara Beyond the Fairy Tale will be streaming on November 18 on netflix

గత రెండేళ్ల కిత్రం ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసీ ద్వారా నయన్ పండంటి మగ కవలలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం విఘ్నేష్ అండ్ నయన్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నయనతార పిల్లలకు సంబంధించి ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూనే ఉంటుంది. అయితే..విఘ్నేశ్ శివ‌న్‌- నయనతారకు పెళ్లి అయి.. రెండు ఏండ్లు దాటింది. అయినా ఇప్పటి వరకూ వారి పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా నెట్టింట్లో కనిపించలేదు. వాస్తవానికి పెళ్లి సమయంలో కొన్ని జాగ్రత్తలు పడ్డారు నయనతార. తన పెళ్లికి వచ్చిన గెస్టులను ఫోటోలు తీయనివ్వలేదు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వెళ్లకుండా చూసుకున్నారు. మీడియా కూడా లోనికి రానివ్వలేదు.

అయితే.. నయనతార తన పెళ్లిని డాక్యుమెంటరీగా రూపొందించి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇలా రూపొందించిన డాక్యుమెంటరీకు 'నయనతార: బియాండ్ ది ఫేరీ టేల్' టైటిల్ ఖరారు చేశారు. అందులో నయనతార కెరీర్, పర్సనల్ లైఫ్, దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమ, పెళ్లి సంగతులతో పాటు మరి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేయనున్నారట. నయనతార డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' పేరుతో నవంబర్ 18న స్ట్రీమింగ్ కానున్నది. న‌య‌న్ పెళ్లి వేడుక‌ డిజిట‌ల్ హ‌క్కుల‌ను రూ.25 కోట్లు వెచ్చించింది నెట్‌ఫ్లిక్స్. ఈ డాక్యూమెంటరీ వీడియో కోసం నయన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X