ఓటీటీలోకి A సర్టిఫికెట్ సినిమా.. ఆ సీన్స్ చూస్తే షాకే.. ఇంతకీ ఎందులో చూడాలంటే!
ఇండియా వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల నుంచి ఎన్నో రకాల చిత్రాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాయి. తద్వారా ప్రేక్షకుల ఆదరణను అందుకుని, అత్యధిక వసూళ్లను రాబట్టుకుని సంచలనమే సృష్టిస్తున్నాయి. అలాంటి సినిమాల్లో ఇటీవలే హిందీ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన 'కిల్' (Kill) ఒకటి.
యంగ్ హీరో లక్ష్య (లక్ష్ లల్వానీ) హీరోగా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ క్రైమ్ మూవీనే 'కిల్'. నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన ఈ చిత్రం 2023లోనే రూపొందింది. అప్పుడే 'టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్', 'ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్'లో ప్రదర్శితం అయింది. అక్కడ దీనికి మంచి స్పందన రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇండియా కంటే ముందే హాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయిన 'కిల్' సినిమాను జూలై 5వ తేదీన ఇండియాలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మొదట్లోనే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది. ఫలితంగా ఇది ఫుల్ రన్‌లో ఈ తక్కువ బడ్జెట్ సినిమా రూ. 50 కోట్లు వరకూ రాబట్టి సత్తా చాటుకుంది.
ఫీల్ గుడ్ లవ్‌తో పాటు క్రైమ్ సన్నివేశాలతో రూపొంది విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'కిల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీ స్థాయిలోనే పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ హక్కులను కొనుక్కుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

షాక్‌కు గురి చేసే యాక్షన్ అండ్ క్రైమ్ సన్నివేశాలతో రూపొందిన 'కిల్' మూవీపై ఓటీటీ స్ట్రీమింగ్‌పై చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ప్రకటన చేసింది. అందులో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో మిస్సైన వాళ్లంతా దీని కోసం వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. లక్ష్య హీరోగా నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన 'కిల్' మూవీని ధర్మా ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, గుణీత్ మోంగా, అపూర్వ్ మెహతా, అచిన్ జైన్‌లు నిర్మించారు. ఇందులో తన్య మణిక్తల హీరోయిన్‌గా నటించగా.. రాఘవ్ జుయల్, అభిషేక్ చౌహాన్, ఆశీష్ విద్యార్థి తదితరులు నటించారు. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











