తెలుగు ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన A సర్టిఫికెట్ సినిమా
దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల నుంచి వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. కానీ, వైల్డ్ కంటెంట్‌తో వచ్చే చిత్రాలకు మాత్రం కాసింత ఎక్కువగానే స్పందన లభిస్తోంది. అలా ఈ మధ్య కాలంలోనే ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే హిందీ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన హై రేంజ్ వైల్డ్ మూవీనే 'కిల్' (Kill).
యంగ్ హీరో లక్ష్య (లక్ష్ లల్వానీ) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లవ్ అండ్ క్రైమ్ సినిమానే 'కిల్'. నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన ఈ చిత్రం 2023లోనే రూపొందింది. అప్పుడే 'టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్', 'ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్'లో స్పెషల్ స్క్రీనింగ్ అయింది. అక్కడ దీనికి మంచి స్పందన రావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

బాలీవుడ్‌లో కంటే ముందే హాలీవుడ్‌లో సెన్సేషన్ అయిన 'కిల్' సినిమాను జూలై 5వ తేదీన ఇండియాలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మొదట్లోనే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో స్పందన కూడా వచ్చింది. ఫలితంగా ఇది ఫుల్ రన్‌లో ఈ తక్కువ బడ్జెట్ సినిమా రూ. 50 కోట్లు వరకూ రాబట్టి సత్తా చాటింది.
మనసుకు హత్తుకునే లవ్‌తో పాటు ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే క్రైమ్ సీన్స్‌తో రూపొంది విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'కిల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీ స్థాయిలోనే పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ హక్కులను తీసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర భారీ డీల్ కుదుర్చుకుంది.

'కిల్' మూవీపై ఓటీటీ స్ట్రీమింగ్‌పై చాలా ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఇటీవలే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళం, మలయాళం వెర్షన్లను సైతం సదరు సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో దక్షిణాది ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎగబడుతున్నారు.
ఇదిలా ఉండగా.. లక్ష్య హీరోగా నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన 'కిల్' మూవీని ధర్మా ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, గుణీత్ మోంగా, అపూర్వ్ మెహతా, అచిన్ జైన్‌లు నిర్మించారు. ఇందులో తన్య మణిక్తల హీరోయిన్‌గా నటించగా.. రాఘవ్ జుయల్, అభిషేక్ చౌహాన్, ఆశీష్ విద్యార్థి తదితరులు నటించారు. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు.


Click it and Unblock the Notifications











