ఓటీటీలోకి రజనీకాంత్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఏడాది తర్వాత స్ట్రీమింగ్‌లోకి..ఎందులో అంటే?

ఓటీటీలోకి కొన్ని సినిమాలు నేరుగా రిలీజ్ అయితే .. కొన్ని వారం తర్వాత, కొన్ని నెల తర్వాత స్ట్రీమింగ్ అవుతాయి. కానీ మరికొన్ని మాత్రం ఏకంగా ఏడాది, రెండేళ్లు గడిచినా ఓటీటీలో అందుబాటులోకి రావు. నిర్మాతలు - ఓటీటీ సంస్ధల మధ్య డీల్ కుదరకపోవడం, టెక్నికల్ ఇష్యూస్, మరికొన్ని అంశాలు ఇందుకు కారణం కావొచ్చు. కానీ ఆయా హీరోల అభిమానులు మాత్రం సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా అని ఎదురు చూస్తుంటారు. ఈ కోవలోకే వస్తుంది సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం. తలైవ నటించిన సినిమాలకు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . అలాంటి రజనీ సినిమాలో భారీ ఆలస్యం జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం

రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలాంలో విష్ణువిశాల్, విక్రాంత్‌, సెంథిల్, జీవిత, కేఎస్ రవికుమార్, నిరోషాలు నటించగా.. రజనీకాంత్ కీలకపాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించగా.. విష్ణు రంగస్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లాల్ సలాం సినిమాను రూ.90 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

Lal Salaam OTT Release when to expect Super Star Rajinikanth s movie to stream online

రజనీ నటించడంతో భారీ హైప్

రజనీకాంత్ కీలకపాత్ర పోషించడంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లాల్ సలాంకు రూ.35 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.36 కోట్ల షేర్.. రూ.72 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఫిబ్రవరి 9, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా .. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపింది. ఓవర్సీస్‌లో టికెట్లు బాగా తెగడంతో రూ. 2 కోట్లు ముందే వచ్చాయి.

భారీ నష్టాలను మిగిల్చిన లాల్ సలాం

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లాల్ సలాంకు ఇండియాలో తొలి రోజు రూ.4.5 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. తొలి వారం రూ.15.44 కోట్లు, రెండో వారంలో రూ.2.02 కోట్లు, మూడో వారంలో రూ.23 లక్షలు, నాలుగో వారంలో రూ.5 లక్షలు చొప్పున థియేట్రికల్ రన్ ముగిసేసరికి భారత్‌లో రూ.17.74 కోట్ల నికర వసూళ్లు.. ఇండిలో రూ.21 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో ఓ మోస్తరుగా రాణించినప్పటికీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అక్కడ కేవలం రూ.10.25 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా లాల్ సలామ్ సినిమా రూ.31.25 కోట్లు మాత్రమే రాబట్టి డిజాస్టర్‌గా నిలిచి ఏకంగా రూ.40 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇక ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా తమిళంలో కానీ, తెలుగులో కానీ సలా సలాం ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే అనివార్య కారణాలతో నెట్‌ఫ్లిక్స్ ఈ హక్కులను మరో ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్‌కు బదిలీ చేసింది. అన్ని రకాల అవాంతరాలు తొలగిపోవడంతో లాల్ సలాం ఓటీటీ రిలీజ్‌పై సన్ నెక్ట్స్ కీలక ప్రకటన చేసింది. జూన్ 6 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరి థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన లాల్ సలాం ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X