OTT: ఓటిటిలో టాప్ 10 షోస్ ఏంటో తెలుసా? రికార్డు వ్యూస్ తో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ లు మీరు చూశారా?

ప్రపంచ వ్యాప్తంగా ఓటిటిల వాడకం ఇపుడు పతాక స్థాయికి చేరుకుంటుంది అని చెప్పాలి. గత అయిదేళ్ళు వెనక్కి వెళ్లి చూస్తే ఈ ఓటిటిలు అంటే ఏంటో చాలా మందికి తెలియదు. కానీ ఇపుడు సగటున ప్రతీ ఒక్కరి దగ్గర మినిమమ్ ఒక్క ఓటిటి యాప్ సబ్ స్క్రిప్షన్ ఉండి తీరుతుంది. ఇలా గత ఐదేళ్లలోనే ఒక రివొల్యూషన్ ని ఓటిటిలు తీసుకొచ్చాయి. మెయిన్ గా లాక్ డౌన్ పరిస్థితి ఓటిటిల వినియోగానికి ఎక్కువయింది.

last week top 10 ott shows in india here is list

కాగా ఇక్కడ నుంచి ప్రస్తుతం మన దేశంలో కూడా ఓటిటిల వాడకం ఓ రేంజ్ లో పెరిగింది. కాగా ఇలా దాదాపు అన్ని టాప్ ఓటిటి సంస్థల్లో పలు రకాల షోస్ అలానే సినిమాలు ఇంకా మరెన్నో ఎంటర్టైనింగ్ కంటెంట్ ఎప్పటికపుడు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. కాగా ఇలా లేటెస్ట్ గా ఒర్మాక్స్ వారు గత వారంలో ఇండియా వైడ్ గా టాప్ 10 షోస్ ని రివీల్ చేశారు. కాగా వీటిలో ప్రతీ షో కూడా మిలియన్స్ కొద్దీ వ్యూస్ ని నమోదు చేయడం విశేషం. కాగా ఈ టాప్ లిస్ట్ ని వరుసగా చూసుకున్నట్టు అయితే..

టాప్ 1:

అనిమల్ సెన్సేషన్ విలన్ బాబీ డియోల్ నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3 ఇటీవల అమెజాన్ ఎం ఎక్స్ ప్లేయర్ లోకి వచ్చి ఇది కూడా హిట్ అయ్యింది. కాగా ఈ సిరీస్ ఏకంగా 4.8 మిలియన్ వ్యూస్ ని గత వారంలో అందుకుని నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది.

టాప్ 2:

ఇక టాప్ 2లో కూడా అమెజాన్ ఎం ఎక్స్ ప్లేయర్ కి సంబంధించిన షో నే నిలవడం విశేషం. హిందీలో ఎంతో ఫేమస్ అయ్యినటువంటి హిప్ హాప్ ఇండియా సీజన్ కి గాను గత వారం 4.3 మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయి. ఈ వారంలో నటి మలైకా అరోరా కాంట్రవర్సీ ఒకటి చెలరేగింది.

టాప్ 3:

కాగా టాప్ 3 లో రీసెంట్ గానే వచ్చిన జియో హాట్ స్టార్ హిందీ వెబ్ సిరీస్ కన్నెడ నిలిచింది. హిందీలో సిరీస్ అయినప్పటికీ ఇది పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండగా ఈ సిరీస్ 4.2 మిలియన్ వ్యూస్ ని అందుకొని మంచి రెస్పాన్స్ ని నమోదు చేసిందని చెప్పవచ్చు.

టాప్ 4:

ఇక టాప్ 4 లో బెంగాలీకి చెందిన థ్రిల్లర్ సిరీస్ నిలవడం విశేషం. కాగా పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి వచ్చిన "ఖాకీ" ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన రోజే అందుకుంది. కాగా ఇది నెట్ ఫ్లిక్స్ లో గత వారం 3.6 మిలియన్ వ్యూస్ ని అందుకోవడం విశేషం.

టాప్ 5:

ఇది మంచి థ్రిల్లర్ సిరీస్ అని చెప్పవచ్చు. జియో హాట్ స్టార్ లోనే వచ్చిన "పవర్ ఆఫ్ పాంచ్" అనే సిరీస్ ఇంట్రెస్టింగ్ ఫాంటసీ జానర్ లో తెరకెక్కింది. కాగా ఈ సిరీస్ కి అందులో 3.4 మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయి.

టాప్ 6:

గత ఏడాది వచ్చిన హిందీ భారీ హిట్ చిత్రం కిల్ సినిమా హీరోయిన్ తాన్యా మణిక్థలా నటించిన లూట్ కాండ్ అనే సిరీస్ ని అమెజాన్ ఎం ఎక్స్ ప్లేయర్ వారు తీసుకురాగా ఈ సిరీస్ కి కూడా 3.4 మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయి.

టాప్ 7:

ఇక టాప్ 7 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చినటువంటి ప్రముఖ వెబ్ సిరీస్ దూపాహియా సిరీస్ నిలిచింది. కాగా దీనికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 3 మిలియన్ వ్యూస్ దక్కాయి.

టాప్ 8:

మరి టాప్ 8 లో సోనీ లివ్ కి చెందిన షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 4 నిలిచింది. కాగా ఈ సిరీస్ అమెరికన్ బిజినెస్ రియాలిటీ షోకి ప్రేరణగా తీసుకొని రాగ గత వారం 2.9 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.

టాప్ 9:

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసుడు జూనియర్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ నటించిన చిత్రం బీ హ్యాపీ టాప్ 9లో నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చాక డీసెంట్ టాక్ అందుకున్న ఈ చిత్రం గత వారం 2.7 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.

టాప్ 10:

ఇక ఫైనల్ గా టాప్ 10 లో ఒక హాలీవుడ్ సిరీస్ నిలవడం విశేషం, ఇంగ్లీష్ లో బాగా పాపులర్ అయ్యినటువంటి డేర్ డెవిల్ కొత్త సీజన్ ని జియో హాట్ స్టార్ వారు తీసుకురాగా ఇందులో 2.5 మిలియన్ వ్యూస్ తో టాప్ 10 లో నిలిచింది.

ఇక ఒర్మాక్స్ వారు ఈ డేటాను మార్చ్ 17 నుంచి 23 వరకు అందించిన సమాచారం కాగా టాప్ 10 లిస్ట్ అయితే ఇలా ఉంది అని చెప్పవచ్చు.

More from Filmibeat

Read more about: ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X