OTTలోకి క్రేజీ లీగల్ థ్రిల్లర్ సిరీస్.. ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగిపోయింది. నిన్న, మొన్నటి వరకు టీవీలూ చూస్తూ ఎంజాయ్ చేసిన వారంతా ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉంటుండడంతో.. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఆలోచనతోనే వచ్చిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అదిరిపోయే లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరే.. ఇల్లీగల్ 3. అయితే ఈ క్రేజీ వెబ్ సిరీస్ కు సంబంధించి ఇప్పటికీ రెండు సీజన్లు వచ్చాయి. ఇప్పుడు రాబోయేది మూడో సీజన్. సాహిర్ రజా దర్శకత్వం వహించిన ఈ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నేహా శర్మ, అక్షయ్ ఒబెరాయ్, కుబ్రా సైత్, పీయూష్ మిశ్రా మరియు సత్యదీప్ మిశ్రాలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అదిరిపోయే కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు గతంలో విపరీతమైన ఆదరణ లభించింది. అందుకే దానికి సీక్వెల్స్ తీసుకు వస్తూ.. సూపర్ హిట్ కొడుతున్నారు.

అయితే తాజాగా రాబోతున్న మూడో సీజన్ గురించి కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు సీజన్లలో నటించిన వాళ్లే ఈసారి సీజన్ లో కూడా కనిపించున్నారు. అయితే ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఏ రోజు విడుదల కాబోతుందో తాజాగ రివీల్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమా వేదికగా ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మే 29వ తేదీ నుంచి జియో సినిమా వేదికగా ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయబోతున్నట్లు జియో సినిమా ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది.

హీందీతో పాటు ఇంగ్లీష్ లో కూడా అందుబాటులోకి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఈ వెబ్ సిరీస్ చూసేందుకు ముందే ప్లాన్ చేసుకోండి. థ్రిల్లర్ స్టోరీస్ ను ఇష్ట పడే వాళ్లు మాత్రం కచ్చితంగా ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











