OTTలోకి క్రేజీ మరాఠీ వెబ్ సిరీస్.. ప్రతీ ఒక్కరి మదిని మెలిపెట్టే దీన్ని ఎక్కడ చూడాలంటే?

రోజురోజుకూ ఓటీటీల హవా ఎక్కువ అయిపోతుంది. అంతా టీవీ ఛానెల్స్ కు బదులుగా ఓటీటీలను ఆశ్రయిస్తూ.. తమకు నచ్చిన చిత్రాలతో పాటు, వెబ్ సిరీస్ లు చూస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉంటుండడంతో.. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఆలోచనతోనే వచ్చిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ మరాఠీ వెబ్ సిరీస్ యే లంపన్. ప్రముఖ మరాఠీ రచయిత ప్రకాష్ నారాయన్ సంత్ రచించిన వన్ వాస్ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ నిపున్ అవినాశ్ ధర్మాధికారి ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ మిహిర్ గోడ్ బోలే ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే చంద్రకాంత్ కులకర్ణి, గీతాంజలి కులకర్ణి, కాదంబరి సదమ్, పుష్కరాజ్ చిర్పుక్టర్, అవని భావేలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరాఠీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను ఒక్క భాషలోనే కాకుండా మరిన్ని భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.

Latest Marati Lampan Web Series Streaming Details Here

ఓ చిన్న పిల్లాడి జీవితం ఓ సంఘటనతో ఎలా మారిపోయింది.. ఆ తర్వాత ఆ బాలుడు తన జీవితాన్ని ఎలా కొనసాగించాడు.. కొత్త ప్రపంచానికి, అలవాట్లు, పద్ధతులకు ఎలా చేరువయ్యాడు అనే కాన్పెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. అయితే ఈ క్రేజీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీట సంస్థ అయిన సోనీ లివ్ వేదికగా ఈ వెబ్ సిరీస్ ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. లంపన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండడంతో అంతా తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు.

Latest Marati Lampan Web Series Streaming Details Here

ప్రతీ ఒక్కరికి తమ బాల్యాన్ని గుర్తు చేస్తూ.. హృదయాలను మెలిపెట్టే విధంగా తీసిన ఈ వెబ్ సిరీస్ చాలా బాగుందంటూ అనేక మంది సోషల్ మీడియాలోలో పోస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య ప్రతీ ఒక్కరూ చూడాల్సిన వెబ్ సిరీస్ లలో ఇది కచ్చితంగా ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఏమాత్రం మిస్ కాకండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X