ఓటీటీలోకి వణుకు పుట్టించే సినిమా.. ఒంటరిగా చూస్తే సుస్సు పోయాల్సిందే!

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ హర్రర్ కాన్సెప్టులతో వచ్చే చిత్రాలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అలాంటి వాటికి దాదాపు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఓటీటీ సంస్థలు కూడా ఈ తరహా చిత్రాలపై ఫోకస్ చేస్తున్నాయి. ఇలా గతంలో వచ్చి సెన్సేషన్ అయిన చిత్రాలను తీసుకొస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే పాత సినిమాలు కొత్తగా ఓటీటీలోకి సత్తా చాటుకున్నాయి. అలా ఇప్పుడు రాబోతున్నదే సినిమానే 'ఐ సా ది డెవిల్' (I Saw the Devil).

లీ బైంగ్ - హమ్ హీరోగా కిమ్ జీ - వూన్ తెరకెక్కించిన కొరియన్ సినిమానే 'ఐ సా ది డెవిల్'. 2010లో రూ.49 కోట్ల‌తో నిర్మించిన ఈ చిత్రం అక్క‌డ రూ. 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టి రికార్డు సృష్టించింది. రెండున్నర గంటల లోపు రన్‌టైంతో డార్క్, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ రివేంజ్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

Lee Byung-hun Starrer I Saw the Devil Movie Streaming on Aha From June 28

'ఐ సా ది డెవిల్' మూవీ థియేటర్లలో దుమ్ముదులపగా.. ఈ చిత్రాన్ని గత ఏడాదిలో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఓటీటీలోకి తీసుకు వచ్చింది. అందులో కూడా ఇది అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇండియాలో సైతం మంచి ఆదరణనను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో కూడా తీసుకు రాబోతున్నారు.

ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ స్కూల్ వ్యాన్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూ రాత్రిళ్లు ఒంట‌రిగా క‌నిపించే ఆడ వారిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపడం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన 'ఐ సా ది డెవిల్' సినిమాను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఇప్పుడు స్ట్రీమింగ్ చేయబోతుంది. జూన్ 28వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా తెలిపింది.

Lee Byung-hun Starrer I Saw the Devil Movie Streaming on Aha From June 28

రివేంజ్ స్టోరీతో క్షణ క్షణం ఉత్కంఠను రేపే స్క్రీన్‌ప్లేతో రూపొందిన 'ఐ సా ది డెవిల్' సినిమాను ఆహా సంస్థ తమిళంలో మాత్రమే అందుబాటులోకి రాబోతున్నట్లు కూడా తెలిపింది. అంటే ఈ చిత్రం తెలుగులో అందుబాటులో ఉండదు. కానీ, దీనికి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. లీ బైంగ్ - హమ్ హీరోగా కిమ్ జీ - వూన్ తెరకెక్కించిన 'ఐ సా ది డెవిల్' సినిమాను కిమ్ హ్యూన్ - వూ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చోయ్ మైనా-సిక్ ఇందులో విలన్‌గా నటించారు. ఈ సినిమాకు Mowg సంగీతాన్ని అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X