LEO Movie OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి లియో.. రెండు డేట్లతో సర్‌ప్రైజ్ చేశారుగా!

సౌత్ ఇండియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే వేరే దేశాల్లో సైతం మార్కెట్‌ను ఏర్పరచుకున్నారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఒకడు. తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు.

'మాస్టర్' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తోన్న విజయ్.. మళ్లీ అదే డైరెక్టర్ లోకేష కనగరాజ్‌తో కలిసి చేసిన సినిమానే 'లియో'. మూవీ ఆరభంలోనే అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

LEO Movie Streaming on Netflix on 24th Nov in India and 28th Nov Globally

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'లియో' మూవీకి ఓవర్సీస్‌లోని ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. దీంతో ఈ సినిమాకు ఏకంగా రూ. 600 కోట్లు వరకూ గ్రాస్ వసూలు అయింది. తద్వారా విజయ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే, తమిళంలోనూ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' మూవీ ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర యూనిట్‌కు రికార్డు స్థాయి మొత్తాన్ని ముట్టజెప్పినట్లు కూడా కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక, ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది.

'లియో' స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 24వ తేదీ నుంచి ఇండియాలో స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఇక, ఈ సినిమాను నవంబర్ 28వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ చేస్తామని కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. విజయ్ - లోకేష్ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించారు. దీనికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X