ఓటీటీలోకి భయంకరమైన సినిమా.. మనిషి మాంసం తినే డాక్టర్‌తో హీరో రొమాన్స్.. ఎలా చూడాలంటే!

ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీలు ఎక్కువగా వస్తున్నయన్న విషయం తెలిసిందే. అలాంటి వాటికి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అదిరిపోయే స్పందన వస్తోంది. ఫలితంగా ఇలాంటి సినిమాలు ఎక్కువగా ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలా ఇటీవలే విడుదలైన మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'ఆమిస్' (Aamis).

లిమా దాస్, అర్ఘదీప్ బారుహ్ ప్రధాన పాత్రల్లో భాస్కర్ హజారికా దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'ఆమిస్'. మనిషి మాంసానికి అలవాటు పడిన డాక్టర్.. ప్రియుడితో కలిసి ఎలాంటి పనులు చేసింది అనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా రిలీజ్ ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది.

Lima Das and Arghadeep Baruah Starrer Aamis Movie Streaming Started on Sonyliv

డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'ఆమిస్' మూవీ మొదట అస్సామీ, హిందీ భాషల్లో 2019లో నవంబర్ 22న విడుదలైంది. కానీ, ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా రెండు భాషల్లోనూ అదిరిపోయే స్పందనను అందుకుని సత్తా చాటుకుంది.

వెన్నులో వణుకు పుట్టించే స్టోరీ లైన్‌తో రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'ఆమిస్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థ నుంచి మంచి పోటీనే వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సోనీలివ్ సంస్థ సొంతం చేసుకుంది. దీన్ని ఇండియాలోని చాలా భాషల్లో స్ట్రీమింగ్ చేయడానికి డీల్ చేసుకుంది.

Lima Das and Arghadeep Baruah Starrer Aamis Movie Streaming Started on Sonyliv

లిమా దాస్, అర్ఘదీప్ బారుహ్ నటించిన 'ఆమిస్' మూవీని సోనీలివ్ సంస్థ ఇటీవలే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమాను అందులో చూసేలా స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక, థియేటర్లలో మాదిరిగా కాకుండా సోనీలివ్‌లో 'ఆమిస్'కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిసింది. దీంతో ఇది రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది.

ఇదిలా ఉండగా.. మనిషి మాంసం తినే కాన్సెప్టుతో రూపొందిన 'ఆమిస్' సినిమాను Signum Productions, Metanormal, Wishberry Films బ్యానర్లపై పూనమ్ డియోల్, శ్యామ్ బోరా నిర్మించారు. క్వ్వాన్ బే దీనికి సంగీతాన్ని అందించారు. ఇందులో నీతాలీ దాస్, సమర్జ్యోతి సర్కార్ కీలక పాత్రలు పోషించారు.

Read more about: aamis bhaskar hazarika lima das
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X