OTT ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్క రోజే ఏకంగా 15 సినిమాలు.. మొత్తంగా ఎన్నో తెలుసా?
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చి సందడి చేస్తున్నాయి. అలాగే థియేటర్లలో విడుదలైన సినిమాలను నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే వాటిలో కొన్ని సినిమాలు రెండు మూడు వారాలకే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. అలా ఇప్పుడు థియేటర్లలో సందడి చేసిన సినిమాలతో పాటు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవనున్నాయి పలు చిత్రాలు, వెబ్ సిరీసులు. ఈ క్రమంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో చూద్దాం.
దాస్ కా ధమ్కీ ; మాస్ హీరో విశ్వక్ సేన్ మరోసారి మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా అట్రాక్ట్ చేసింది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ మూవీ ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

కబ్జా : విలక్షణ నటుడిగా పేరొందిన కన్నడ హీరో ఉపేంద్ర తాజాగా కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ బ్యూటీ శ్రీయ సరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామాకా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 17న విడుదలై కేజీఎఫ్ లా ఉందని విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు కబ్జా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.
అసలు : నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు రవిబాబు. తాజాగా ఆయన దర్శకత్వం వహించి నటించిన చిత్రం 'అసలు'. ఈ సినిమాలో హీరోయిన్ గా పూర్ణ చేసింది. హారర్ జోనర్ లో రానున్న ఈ సినిమా ఏప్రిల్ 13 నుంచి ఈటీవీ విన్ అనే కొత్త ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఈటీవీ విన్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టడం విశేషం.

జూబ్లీ : బ్యూటిఫుల్ అదితి రావు హైదరి తాజాగా నటించిన వెబ్ సిరీస్ జూబ్లీ. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ప్రముఖ బెంగాలీ నటులతో పాటు కొత్త బంగారు లోకం ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్, భలే మంచి రోజు హీరోయిన్ వామికా గబ్బి కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 7న ఐదు ఎపిసోడ్స్ తో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక రిలీజైన ఈ సిరీస్ రెండో పార్టులోని మిగతా 5 ఎపిసోడ్స్ ను ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.
నెట్ ఫ్లిక్స్ :
కన్నయి నంబాతే (తమిళం)- ఏప్రిల్ 14
ది లాస్ట్ కింగ్ డమ్: సెవెన్ కింగ్స్ మస్ట్ డై (ఇంగ్లీష్)-ఏప్రిల్ 14
వెదరింగ్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 14
ఫినామినా (స్పానిష్)- ఏప్రిల్ 14
క్వీన్స్ ఆన్ ది రన్ (మెక్సికన్)- ఏప్రిల్ 14
క్వీన్ మేకర్ (కొరియన్-వెబ్ సిరీస్)- ఏప్రిల్ 14
జీ5 :
ప్రణయ విలాసం (మలయాళం)- ఏప్రిల్ 14
మిస్సెస్ అండర్ కవర్ (హిందీ)- ఏప్రిల్ 14
మిత్రన్ దా నా చల్దా (పంజాబీ)- ఏప్రిల్ 14
ప్రోజాపోటీ (బెంగాలీ)- ఏప్రిల్ 14
ఏకంగా 15 : ఇవేకాకుండా ఆహా తమిళంలో సూపర్ హిట్ హారర్ మూవీ 'మసూద' తమిళ్ భాషలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ద మార్వలస్ మిసెస్ మైసెల్' అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 5వ సీజన్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ఓ కల' అనే తెలుగు మూవీ ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా మొత్తంగా ఏప్రిల్ 14న అంటే శుక్రవారం ఒక్క రోజునే ఏకంగా 15 సినిమాలు, సిరీసులు విడుదల అవుతూ ఫ్రైడే ఫెస్టివల్ గా మార్చాయి. ఇక ఈ వారం మొత్తంగా 17 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











