OTT: ఈ వారం ఏకంగా 30 సినిమాలు.. ఒక్కరోజు మాత్రం 13.. ఆ సినిమాలపైనే ఫోకస్!

మూవీ లవర్స్ కు ఏకైక ఎంటర్టైన్ మెంట్ సినిమాలు. అందుకే ఓటీటీ సంస్థలు ఎప్పుడు విభిన్నమైన సినిమాలను విడుదల చేస్తుంటాయి. ప్రతీ వారం డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను తీసుకొస్తున్నారు. థియేటర్లలలో విడుదలై హిట్ అయినా ఫట్టు అయినా చిత్రాలతోపాటు కొన్నింటిని నేరుగా రిలీజ్ చేస్తున్నాయి ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్స్. ఇక కరోనా తర్వాత భాషా బేధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎంజాయ్ చేస్తున్నారు సినీ ప్రేమికులు. ఇక ఈ వారం అంటే మార్చి ఐదో వారం విడుదల అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం.

అవతార్ 2

అవతార్ 2

హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సిల్వర్ స్క్రీన్‌ విజువల్ వండర్‌ ప్రాజెక్ట్‌ అవతార్‌. దానికి సీక్వెల్ గా వచ్చిన అవతార్ 2 సినిమా కూడా వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. గతేడాది విడుదలైన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 28 నుంచి రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. అవతార్‌ 2 ను చూడాలంటే 19.99 అమెరికన్‌ డాలర్లు ఖర్చు చేయాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 1600 రూపాయలు.

అమిగోస్

అమిగోస్

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన ప్రయోగాత్మక చిత్రం అమిగోస్. న్యూ డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ, తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంపై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది.

శ్రీదేవీ శోభన్ బాబు

శ్రీదేవీ శోభన్ బాబు

మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగ వ్యవహరించిన మూవీ శ్రీదేవి శోభన్ బాబు. ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ తొలిసారి జత కట్టిన ఈ సినిమాకు ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 సత్తిగాని రెండెకరాలు-గోదారి

సత్తిగాని రెండెకరాలు-గోదారి

పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ హీరోగా తెరకెక్కిన సినిమా 'సత్తిగాని రెండెకరాలు'. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీతో అభినవ్ రెడ్డి దండ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. వెన్నెల కిశోర్, బిత్తిరి సత్తి, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఆహాలో 'గోదారి' అనే మరో సినిమా మార్చి 31న విడుదల కానుంది.

 నెట్ ఫ్లిక్స్:

నెట్ ఫ్లిక్స్:

మై లిటిల్ పోనీ: టెల్ యువర్ టేల్-మార్చి 27 (ఇంగ్లీష్)
ఎమర్జెన్సీ: NYC-మార్చి 29 (ఇంగ్లీషు)
అన్ సీన్-మార్చి 29 (ఇంగ్లీష్ మూవీ)
ఫ్రమ్ మీ టూ యూ: కిమీ నీ తోడోకే-మార్చి 30 (కొరియన్)
ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మోహబత్-మార్చి 31 (హిందీ)
కాపీక్యాట్ కిల్లర్-మార్చి 31
కిల్ బోక్సూన్-మార్చి 31 (కొరియన్)
మర్డర్ మిస్టరీ-మార్చి 31 (ఇంగ్లీష్)
కంపెనీ ఆఫ్ హీరోస్-ఏప్రిల్ 1 (ఇంగ్లీష్)
జార్ హెడ్ 3: ది సీజ్-ఏప్రిల్ 1 (ఇంగ్లీష్)
షెహజాదా-ఏప్రిల్ 1 (హిందీ)
స్పిరిట్ ఆన్ టేమ్డ్-ఏప్రిల్ 1 (ఇంగ్లీష్)
వార్ సెయిలర్-ఏప్రిల్ 2 (ఇంగ్లీష్)

జీ5:

జీ5:

అగిలన్-మార్చి 31 (తమిళం)
అయోతి-మార్చి 31 (తమిళం)
యునైటెడ్ కచ్చే-మార్చి 31 (హిందీ)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

డాగీ కమిలోహా MD సీజన్ 2-మార్చి 31 (ఇంగ్లీష్)
గ్యాస్ లైట్-మార్చి 31 (హిందీ)
ఆల్ దట్ బ్రీత్స్-మార్చి 31 (హిందీ)

ఎమ్ఎక్స్ ప్లేయర్ లో 'ఇండియన్ సమ్మర్స్' హిందీ మూవీ మార్చి 27న, బుక్ మై షోలో 'మమ్మీస్' అనే ఇంగ్లీష్ సినిమా మార్చి 27న విడుదల కానున్నాయి. ఈటీవీ విన్ ఓటీటీలో 'డియర్ మేఘ' అనే తెలుగు సినిమా మార్చి 29న రిలీజ్ అవనుంది. సన్ నెక్ట్స్ లో 'భగీరా' అనే తమిళ మూవీ మార్చి 31న, ముబీ అనే ఓటీటీలో 'ప్లీజ్ బేబీ ప్లీజ్' ఇంగ్లీష్ మూవీ మార్చి 31న, అలాగే యాపిల్ టీవీ ప్లస్ లో 'టెట్రిస్' ఇంగ్లీష్ సినిమా మార్చి 31న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఈ వారం సినిమాలు, సిరీస్ లు అన్ని కలిపి 30 విడుదల కానున్నాయి. మార్చి 31న ఒక్కరోజే 13 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా అవతార్ 2, అమిగోస్ చిత్రాలపైనే అందరి దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X