థియేటర్ ఓటీటీలో సినిమాల పండుగ.. మొత్తంగా 22 చిత్రాలు.. ఆ ఒక్క రోజు మాత్రం!

ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అటు బాక్సాఫీస్ వద్ద.. ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై పలకరిస్తుంటాయి. ఒక్కొసారి పెద్ద సినిమాలే పోటీగా వస్తే.. మరోసారి చిన్న సినిమాలు సత్తా చాటేందుకు సిద్దమవుతాయి. గత వారం అయితే సమంత ప్రతిష్టాత్మక చిత్రం శాకుతంలంతోపాటు కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాలు సందడి చేశాయి. ఈ సారి మరికొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. వాటితోపాటు ఓటీటీల్లోనూ సినిమాలు, వెబ్ సిరీసులు అలరించేందుకు వస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.

విరూపాక్ష:సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 15వ చిత్రంగా వస్తున్న మూవీ 'విరూపాక్ష'. బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేస్తున్నారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్నాయి. 'విరూపాక్ష' నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

List Of OTT And Theatres Movies Web Series Released On April 3rd Week 2023

హలో మీరా:గార్గేయి యల్లా ప్రగడ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా హలో మీరా. ఈ సినిమాతో కూడా కాకర్ల శ్రీనివాస్ అనే కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నారు. అంతేకాకుండా చేస్తున్న తొలి సినిమాలో ఒకే ఒక్క క్యారెక్టర్ తో రూపొందించి ఆశ్చర్యపరిచారు దర్శకుడు కాకర్ల శ్రీనివాస్. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మీరా అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ మూవీ కూడా ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.

యాంట్ మ్యాన్ 3:హలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్ మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో 31వ చిత్రంగా, యాంట్ మ్యాన్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వచ్చింది 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా'. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇండియాలో ఫిబ్రవరి 17న చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On April 3rd Week 2023

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి:యంగ్ హీరో నాగ శౌర్య, బ్యూటిఫుల్ మాళవిక నాయర్ రెండోసారి జత కట్టిన చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. నటుడు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 17న విడుదల అయింది. బాక్సాఫిస్ వద్ద మిక్స్ డ్ టాక్ అందుకున్న ఈ సినిమా తాజాగా ఏప్రిల్ 24న సన్ నెక్ట్స్ లో విడుదల కానుంది.

సత్తిగాని రెండెకరాలు:ఫుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ హీరోగా నటించిన చిత్రం 'సత్తిగాని రెండెకరాలు'. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంతో అభినవ్ రెడ్డి దండ కొత్త దర్శడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేస్తుండగా ఇప్పటికీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ 24 నుంచి తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.

List Of OTT And Theatres Movies Web Series Released On April 3rd Week 2023

నెట్‌ఫ్లిక్స్‌

హౌ టుగెట్ రిచ్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 18
చింప్ ఎంపైర్ (డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 19
ది మార్క్‌డ్‌ హార్ట్ (సీజన్ 2)- ఏప్రిల్ 19
చోటా భీమ్ (సీజన్ 17)- ఏప్రిల్ 20
టూత్‌పరి (హిందీ)- ఏప్రిల్ 20
డిప్లొమ్యాట్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 20
సత్య 2 (తెలుగు)- ఏప్రిల్ 20
రెడీ (తెలుగు)- ఏప్రిల్ 21
ఇండియన్ మ్యాచ్ మేకింగ్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 21
ఏ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 21

మరికొన్ని ఓటీటీ సినిమాలు..:వీటితో పాటు సోనీ లివ్ లో 'గర్మీ' వెబ్ సిరీస్ ఏప్రిల్ 21న విడుదల అవుతోంది. అలాగే 'సుగా' అనే డాక్యుమెంటరీ మూవీ ఏప్రిల్ 21న, 'వేద్' హిందీ చిత్రం ఏప్రిల్ 26న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానున్నాయి. 'ఘోష్టీ' మూవీ ఏప్రిల్ 21, 'యూ టర్న్' హిందీ చిత్రం ఏప్రిల్ 28న జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో 'పాతు తలా' ఏప్రిల్ 21న, బుక్ మై షోలో 'షాజమ్: ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్' (షాజమ్ 2) ఏప్రిల్ 18న విడుదల అవుతున్నాయి.

List Of OTT And Theatres Movies Web Series Released On April 3rd Week 2023

ఒక్కరోజే 9 సినిమాలు:అయితే ఇలా ఈవారం ఓటీటీ, థియేటర్ అన్నింట్లో కలిపి 22 సినిమాలు విడుదల కానున్నాయి. ఇక థియేటర్లలో 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఓటీటీలో మాత్రం ఏకంగా 20 చిత్రాలు, సిరీసులు రిలీజ్ అవనున్నాయి. ఏప్రిల్ 21న మొత్తంగా 9 చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X