OTT: థియేటర్-ఓటీటీల్లో సినీ జాతర.. ఆ ఒక్కరోజే 10 రిలీజ్.. మొత్తంగా తెలిస్తే?
మళ్లీ కొత్త వారం రానే వచ్చింది. ఈవారం కొత్త నెల అదే ఆగస్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. అయితే గత జూలై నెలలో ఎక్కువగా చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని మాత్రమే విజయవంతంగా నడిచాయి. భారీ బడ్జెట్ సినిమాలు ఏవి అంతగా రాలేదు.
గత వారం పవన్ కల్యాణ్ బ్రో సినిమాకు మిక్స్ డ్ టాక్ తో పాటు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈవారం ఆగస్టు ఫస్ట్ వీక్ కొత్త సినిమాలు, వెబ్ సిరీసులతో థియేటర్లు, ఓటీటీలు రెడీగా ఉన్నాయి.

ఎల్‌జీఎం (LGM): ఇండియన్ ఎక్స్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి సినిమా 'ఎల్‌జీఎం' (LGM Movie). 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనేది క్యాప్షన్. లవ్ టుడే బ్యూటి ఇవానా (Ivana), హరీష్ కల్యాణ్ జోడీగా నటించిన ఈ సినిమాలో నదియా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. రమేష్ తమిళమణి తెరకెక్కించిన ఈ సినిమాను సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించారు. ఆగస్టు 4న థియేటర్లలో సందడి చేయనుంది ఈ సినిమా.

రాజుగారి కోడిపులావ్: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, శివ కోన, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కేథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి ముఖ్య పాత్రలతో వస్తున్న సినిమా 'రాజుగారి కోడిపులావ్' (Rajugari Kodipulao Movie). శివ కోన స్వీయ డైరెక్షన్, నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విక్రమ్ రాథోడ్: బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలతో బాగా పాపులర్ అయిన హీరో విజయ్ ఆంటోని. ఇటీవలే హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన నటించిన మరో సినిమా 'విక్రమ్ రాథోడ్' (Vikram Rathod Movie 2023). బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్. కౌశల్య రాణి నిర్మాతగా వ్యవహరించారు. సోనూసూద్, సురేష్ గోపి, యోగిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం కూడా ఆగస్టు 4న విడుదల కానుంది.

మిస్టేక్: అభినవ్ సర్దార్ హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన సినిమా 'మిస్టేక్' (Mistake Movie 2023). యాక్షన్ కామెడీ, సస్పెన్స్ అంశాలతో వస్తున్న ఈ సినిమాకు భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించారు. ఇది ఆగస్టు 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇవే కాకుండా 'దిల్ సే' (Dil Se 2023) ఆగస్టు 4న, హాలీవుడ్ మూవీ మెగ్ 2 (Meg 2) ఆగస్టు 3న విడుదలకు రెడీగా ఉన్నాయి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 (హాలీవుడ్ మూవీ)-ఆగస్టు 2
దయా (Dayaa) (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 4
నెట్ ఫ్లిక్స్:
చూనా (హిందీ సిరీస్)-ఆగస్టు 3
రంగబలి (తెలుగు సినిమా)-ఆగస్టు 4
ది హంట్ ఫర్ వీరప్పన్ (డాక్యుమెంటరీ సిరీస్)-ఆగస్టు 4
సోనీ లివ్:
పరేషాన్ (తెలుగు)-ఆగస్టు 4
పోర్ తోడిల్ (తమిళం)-ఆగస్టు 4
ధూమం (కన్నడ-తెలుగు)-ఆగస్టు 4 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
మొత్తంగా: ఇలా ఆగస్టు 1వ వారం థియేటర్లలో 6 సినిమాలు ఓటీటీలో 8 విడుదల కానున్నాయి. థియేటర్ అండ్ ఓటీటీ కలిపి మొత్తంగా 14 రిలీజ్ అవనున్నాయి. ఇక ఆగస్టు 4 శుక్రవారం రోజున అన్ని కలిపి 10 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం థియేటర్లలో ఆగస్టు 4న 5, ఓటీటీలో 6 సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











