OTT: ఈ వారం థియేటర్‌లో 3, ఓటీటీలో 24.. రోజుకు మూడు చూసినా ఒడువని సినీ జాతర
మళ్లీ కొత్త వారం వచ్చేసింది. ఇక మూవీ లవర్స్ కోసం సినీ జాతర మొదలు కాబోతుంది. థియేటర్లో రెండు బిగ్ మూవీస్ ఉండగా.. ఓటీటీలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. రోజుకు మూడు చొప్పున చూసినా... సినీ జాతర మాత్రం ఒడువదు. ఈ వారం సినీ ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఇక ఏ ఓటీటీలో ఏ సినిమా, వెబ్ సిరీస్ విడుదల కాబోతుందో ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ వారం సినీ ప్రేమికులకు పండగే అని చెప్పవచ్చు. ఓ వైపు థియేటర్లో కొత్త సినిమాలు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో అంతకు మించి సినిమాలు వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఇక థియేటర్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వారు కీలక పాత్రల్లో నటించారు. జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక మరో పెద్ద సినిమా భోళా శంకర్ థియేటర్లలో సందడి చేయనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా, మహానటి కీర్తి సురేష్, సుశాంత్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా తమిళ సినిమా వేదాలంకు రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. భోళా శంకర్, జైలర్ సినిమాలకు పోటీగా మహేశ్ బాబు బిజినెస్ మ్యాన్ రీరిలీజ్ కానుంది.
ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే... ఈవారం ఓటీటీలో ఏకంగా 25 సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి. అందులో ఆసక్తి కలిగించే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటంటే... తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన పోర్ తోడిల్ సోని లివ్ లో విడుదల కానుంది. విక్కి కౌషల్ నటించిన 'జరా హాట్కే జరా బచ్కే' కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఇక ఓంకార్ తమ్ముడు అశ్విన్ నటించిన హిడంబి మూవీ, మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ , ది కాశ్మీర్ ఫైల్స్ ఆన్ రిపోర్టడ్ , నేయమర్ వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వారం రాబోతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్
లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08
అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08
జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 08
మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10
పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10
హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11
పద్మిని (మలయాళ చిత్రం) - ఆగస్టు 11
బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 12

హాట్‌స్టార్
నెయ్‍మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08
కమాండో (హిందీ సిరీస్) - ఆగస్టు 11
అమెజాన్ ప్రైమ్
మహావీరుడు ( శివకార్తికేయన్ సినిమా) - ఆగస్టు 11
మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 10
రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11
జియో సినిమా
జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా) - ఆగస్టు 11

హిడింబ (తెలుగు సినిమా) - ఆగస్టు 10
వేరే మారి ఆఫీస్ (తమిళ సిరీస్) - ఆగస్టు 10
వాన్ మూండ్రు (తమిళ మూవీ) - ఆగస్టు 11
జీ5
అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) - ఆగస్టు 11
ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 11
సోనీ లివ్
ద జెంగబూరు కర్స్ (హిందీ సిరీస్) - ఆగస్టు 09
పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 11
ఆపిల్ ప్లస్ టీవీ
స్ట్రేంజ్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 09
లయన్స్ గేట్ ప్లే
హై హీట్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11
మొత్తంగా ఎన్నంటే?
ఈ వారం అంటే ఆగస్టు రెండో వారంలో థియేటర్ అండ్ ఓటీటీ అన్ని కలిపి 27 సినిమాలు, సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లలో 2, ఒక రీరిలీజ్ మూవీ ఓటీటీల్లో 24 విడుదల అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











