OTT: మళ్లీ సినీ జాతర ప్రారంభం.. ఓటీటీలో ఏకంగా 14 రిలీజ్.. మొత్తంగా తెలిస్తే?
మళ్లీ కొత్త వారం రానే వచ్చింది. ఈ ఆగస్ట్ నెలలో గతవారం బడా హీరోల సినిమాలు విడుదలై సందడి చేశాయి. ఆగస్ట్ 10న జైలర్ మూవీతో సూపర్ స్టార్ రజనీ కాంత్ మాసివ్ అటాక్ చేయగా.. ఆగస్ట్ 11న భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి డీలా పడ్డారు. ఇక ఇప్పుడు చిన్న సినిమాల సందడి షురూ కానుంది. ఓవైపు థియేటర్, మరోవైపు ఓటీటీలో అన్ని చిన్న సినిమాలు అన్ని రకాలుగా వినోదాన్ని పంచేందుకు రెడీ అయ్యాయి. మరి అవేంటో చూసేద్దామా!
ప్రేమ్ కుమార్: సంతోష్ శోభన్ హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్' (Prem Kumar Movie). రాశిసింగ్, రుచిత సాదినేని హీరోయిన్స్ గా చేస్తున్న ఈ సినిమాతో రచయిత అయినటువంటి అభిషేక్ మహర్షి దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సారంగ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదల కానుంది.

మిస్టర్ ప్రెగ్నెంట్: బిగ్ బాస్ ద్వారా క్రేజ్ సంపాదించుకుని హీరో అయ్యాడు సయ్యద్ సోహైల్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ ప్రెగ్నెంట్' (MR Pregnant). శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రూపా కొడువయూర్ హీరోయిన్. సుహాసిని, అలీ, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేశారు. అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న రిలీజ్ కు రెడీగా ఉంది.

జిలేబి: : నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, జై చిరంజీవ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ కె. విజయభాస్కర్ తనయుడు శ్రీ కమల్ హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జిలేబి' (Jilebi Movie). హీరోయిన్ గా శివానీ చేయగా.. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. గుంటూరు రామకృష్ణ నిర్మాత. ఈ మూవీ ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా: తమిళ కమెడియన్ సంతానం హీరోగా చేస్తున్న మరో సినిమా 'డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా' (DD Returns Bhootala Bungalow). హారర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా తమిళంలో ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఆగస్ట్ 18న రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఎస్. ప్రేమ్ దర్శకత్వం వహించారు.

పిజ్జా 3: తమిళంలో విజయవంతమైన హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ 'పిజ్జా' నుంచి రాబోతున్న సినిమా 'పిజ్జా 3' (Pizza 3). అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధానపాత్రల్లో చేసిన ఈ మూవీ కూడా ఇటీవల తమిళంలో మంచి విజయం సాధించింది. దీన్ని మోహన్ గోవింద్ తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులో ఆగస్ట్ 18నే విడుదల చేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్
నో ఎస్కేప్ రూమ్ (హాలీవుడ్)- ఆగస్ట్ 15
అన్‌టోల్డ్: ఆల్ ఆఫ్ షేమ్ (హాలీవుడ్)- ఆగస్ట్ 15
డెప్ వర్సెస్ హార్డ్ (డాక్యుమెంటరీ)- ఆగస్ట్ 16
గన్స్ అండ్ గులాబ్స్ (హిందీ-తెలుగు)- ఆగస్ట్ 18
మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్)- ఆగస్ట్ 18
బుక్ మై షో
డాంఫైర్ (హాలీవుడ్)- ఆగస్ట్ 15
బాబిలోన్ 5: రోడ్ హోమ్ (హాలీవుడ్)- ఆగస్ట్ 15
స్టోరీస్ నాట్ టుబీ టోల్డ్ (హాలీవుడ్)- ఆగస్ట్ 15
జియో సినిమా
తాలి (హిందీ)- ఆగస్ట్ 15
ఫ సే ఫాంటసీ (హిందీ సిరీస్)- ఆగస్ట్ 17
అన్నపూర్ణ ఫొటో స్టూడియో (తెలుగు)- ఆగస్ట్ 15- ఈటీవీ విన్
ఛత్రపతి (హిందీ)- ఆగస్ట్ 15- జీ5
మైండ్ కేజ్ (హాలీవుడ్)- ఆగస్ట్ 15- లయన్స్ గేట్ ప్లే
హర్లాన్ కొబెన్స్ షెల్టర్ (వెబ్ సిరీస్)- ఆగస్ట్ 18- అమెజాన్ ప్రైమ్ వీడియో
మొత్తంగా తెలిస్తే?
ఇలా ఈ వారం ఓటీటీ, థియేటర్ రెండింట్లో కలిపి మొత్తంగా 19 విడుదల కానున్నాయి. థియేటర్లలో 5, ఓటీటీలో 14 రానున్నాయి. ఇక ఆగస్ట్ 18న థియేటర్లలో 5, ఓటీటీలో 3 మాత్రమే రిలీజ్ కానున్నాయి. అయితే ఆగస్ట్ 18న ఓటీటీ, థియేటర్ రెండు కలిపి 8 రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











