OTT movies: బేబీ, బ్రో సహా ఓటీటీలో ఈ వారం 21 సినిమాలు... కానీ దాని కోసమే వెయిటింగ్!
సీని లవర్స్ కు ఈ వారం పండగే అని చెప్పవచ్చు. అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలో మంచి మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున, కార్తీకేయ బెదురులంక 2012, దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోట సినిమాలు థియేటర్లల్లోకి రానున్నాయి. ఇక ఇటు ఓటీటీలోనూ బేబీ, బ్రో సినిమాలతో సహా 21 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అయితే బేబీ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.
మొదటగా ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే... వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున ఆగస్టు 25న విడుదల థియేటర్లోకి రానుంది. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రంశుక్రవారం థియేటర్లోకి రానుంది.

మరోవైపు కార్తీకేయ నటించిన బెదురులంక 2012 కూడా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. యుగాంతం భయంతో ఒక ఊరిలో జరిగే సంఘటనలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు మేకర్స్. కార్తికేయ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్లాక్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇక దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ కింగ్ ఆఫ్ కోట.. ఒక రోజు ముందుగానే ఆగస్టు 24న విడుదల అవుతుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా కనిపించింది. అభిలాష్ జోషిలీ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ పూర్తి స్థాయిలో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీపై దుల్కర్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు విషయానికి వస్తే...
ఆహా ఓటీటీ
1. బేబీ (తెలుగు సినిమా) - ఆగస్టు 25న విడుదల
నెట్‌ఫ్లిక్స్
1. బ్రో (తెలుగు మూవీ) - ఆగస్టు 25న విడుదల
2. లైట్ హౌస్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 22న విడుదల
3. బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) - ఆగస్టు 24న విడుదల
4. రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 24న విడుదల
5. కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25 న విడుదల
6. యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 25న విడుదల
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
1. అశోక (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23న విడుదల
2. ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25న విడుదల
3. ఆఖరి సచ్ (హిందీ సిరీస్) - ఆగస్టు 25న విడుదల
బుక్ మై షో
1. సమ్ వేర్ ఇన్ క్వీన్స్ - ఇంగ్లీష్ సినిమా - ఆగస్టు 21న విడుదల
ఆపిల్ ప్లస్ టీవీ
1. ఇన్‌వేజన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23న విడుదల
2. వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25న విడుదల
మనోరమ మ్యాక్స్
1. కురుక్కన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25న విడుదల


Click it and Unblock the Notifications











