OTT థియేటర్-ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు.. ఒక్కరోజే 7.. మొత్తంగా ఎన్నో తెలుసా?

మళ్లీ సినిమాల సందడి షురూ కాబోతుంది. స్పై, సామజవరగమన సినిమాల తర్వాత అంటే గత వారం పెద్దగా చెప్పుకునే సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద విడుదల కాలేదు. నాగ శౌర్య నటించిన రంగబలి, రుద్రంగి సినిమాలు రెండు మాత్రమే చెప్పుకోదగ్గవి ఉన్నాయి. దీంతో లాస్ట్ వీక్ పెద్దగా సందడి కనిపించలేదు. కానీ, ఈ వారం (జూలై రెండో వారం) ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు థియేటర్లలో ఆసక్తికరమైన సినిమాలు రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఎప్పటిలానే ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు కూడా అలరిస్తామంటూ ముందుకు వచ్చేస్తున్నాయి.

మిషన్ ఇంపాజిబుల్ 7:హాలీవుడ్ స్పై యాక్షన్ చిత్రాల్లో 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈథన్ హంట్ గా టామ్ క్రూజ్ నటించిన ఈ మూవీ సిరీస్ నుంచి ఏడో సినిమాగా వస్తుంది 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission: Impossible - Dead Reckoning Part One). రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా పార్ట్ 1 జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇంగ్లీషుతోపాటు ప్రాంతీయ భాషల్లో సందడి చేయనుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On July 2nd Week 2023

బేబి:విజయ్ దేవరకొండ సోదరుడు ఆనందే దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి (Baby 2023). సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌కేఎన్ (శ్రీనివాస కుమార్) నిర్మాతగా వ్యవహరించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న బేబి జూలై 14న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంది.

List Of OTT And Theatres Movies Web Series Released On July 2nd Week 2023

నాయకుడు:లోక నాయకుడు కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ టైటిల్ తో వస్తున్న మూవీ 'నాయకుడు'. తమిళంలో మంచి హిట్ సాధించిన 'మామన్నన్' (Maamannan) మూవీని తెలుగులో 'నాయకుడు' (Nayakudu 2023) పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 14న రిలీజ్ కానుంది. దీన్ని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి.

List Of OTT And Theatres Movies Web Series Released On July 2nd Week 2023

మహావీరుడు:రెమో, వరుణ్ డాక్టర్, డాన్, ప్రిన్స్ చిత్రాలతో తెలుగు వారిని అలరించిన తమిళ హీరో శివ కార్తికేయన్. ఆయన హీరోగా మడోన్ అశ్విన్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ 'మహావీరుడు' (Mahaveerudu). డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకు అరుణ్ విశ్వ నిర్మాత. ఈ సినిమాను కూడా జూలై 14నే అంటే శుక్రవారం థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

List Of OTT And Theatres Movies Web Series Released On July 2nd Week 2023

భారతీయన్స్:డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న సినిమా 'భారతీయన్స్: ది న్యూ బ్లడ్' (Bharateeyans). నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభారంజన్, మహేందర్ బర్గాస్ మెయిన్ రోల్స్ చేసిన ఈ సినిమాలో సమైరా సంధు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్స్. దీన్ రాజ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాను డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ఈ సినిమా కూడా జూలై 14న రిలీజై అదృష్టం పరిక్షీంచుకోనుంది.

ఓటీటీ సినిమాలు:

జానకి జానే (మలయాళం)- జూలై 11 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
ది ట్రయల్ (హిందీ)- జూలై 14 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)

బర్డ్ బాక్స్ బార్సిలోనా (హాలీవుడ్)- జూలై 14 (నెట్‌ఫ్లిక్స్)
కొహరా (హిందీ)- జూలై 15 (నెట్‌ఫ్లిక్స్)

క్రైమ్ పెట్రోల్-48 అవర్స్ (హిందీ)- జూలై 10 (సోనీ లివ్)
కాలేజ్ రొమాన్స్ (హిందీ)- జూలై 15 (సోనీ లివ్)

ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్)- జూలై 11 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
మాయబజార్ ఫర్ సేల్ (తెలుగు)- జూలై 14 (జీ5)

మొత్తంగా:ఇలా జూలై రెండో వారం థియేటర్ అండ్ ఓటీటీ అన్నీ కలిపి 13 సినిమాలు విడుదల కానున్నాయి. జూలై 14న ఒక్కరోజే రెండింట్లో కలిపి 7 రిలీజ్ కానున్నాయి. ఇక థియేటర్లో 5, ఓటీటీ 8 సినిమాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూలై 14న థియేటర్లలో 4, ఓటీటీలో 3 స్ట్రీమింగ్ కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X