OTT: థియేటర్-ఓటీటీల్లో చిన్న చిత్రాల సందడి.. ఒక్కరోజే 6.. ఆ 3 సినిమాలపైనే ఫోకస్!

మళ్లీ కొత్త వారం రానే వచ్చేసింది. న్యూ వీక్ వచ్చిందంటే చాలు న్యూ మూవీస్ సందడి చేస్తుంటాయి. గతవారం బేబీ, మిషన్ ఇంపాజిబుల్ 7, మహావీరుడు వంటి చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అలాగే ఓటీటీల్లో కూడా విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు సందడి చేశాయి.

ఇప్పుడు జూలై మూడో వారం కూడా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులతో అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మరి ఈ వారం థియేటర్లలో, ఓటీటీ వేదికల్లో ఏయే సినిమాలు, సిరీసులు రిలీజుకు రెడీగా ఉన్నాయో చూద్దాం పదండి.

List Of OTT And Theatres Movies Web Series Released On July 3rd Week 2023

హిడింబ: ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం 'హిడింబ' (Hidimbha). ఇందులో బ్యూటిఫుల్ నందితా శ్వేత హీరోయిన్ గా చేస్తోంది. గంగపట్నం శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. జూలై 20న థియేటర్లలో విడుదలయ్యే ఈ సినిమాతో అశ్విన్ బాబు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

List Of OTT And Theatres Movies Web Series Released On July 3rd Week 2023

హత్య: బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హత్య' (Hatya Movie 2023). బాలాజీ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో గురు ఫేమ్ రితికా సింగ్, హిట్ 2 బ్యూటి మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమా జూలై 21న థియేటర్లలో విడుదల కానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On July 3rd Week 2023

అన్నపూర్ణ ఫొటో స్టూడియో: '30 వెడ్స్ 21' వెబ్ సిరీసుతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు చైతన్య రావు. ఇటీవల 'ముఖచిత్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజాగా నటించిన మూవీ 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' (Annapurna Photo Studio). చైతన్య రావుకు జోడీగా లావణ్య చేస్తుండగా.. చెందు ముద్దు తెరకెక్కించారు. యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా జూలై 21 థియేటర్లలో రిలీజ్ కానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On July 3rd Week 2023

అలా ఇలా ఎలా: చంద్రముఖి, నాగవల్లి, కథానాయకుడు వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన ప్రముఖ దర్శకుడు పి. వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా నటించిన చిత్రం 'అలా ఇలా ఎలా' (Ala Ila Ela Movie). రాఘవ దర్శకత్వంలో పూర్ణ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ కూడా జూలై 21న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది.

ఓటీటీ: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ (యానిమేషన్)- జూలై 18 (జీ5)

జాన్వీ కపూర్ 'బవాల్' (Bawaal)- జూలై 21 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ట్రయల్ పీరియడ్ (హిందీ)- జూలై 21 (జియో సినిమా)

నెట్ ఫ్లిక్స్: ది డీపెస్ట్ బ్రీత్ (హాలీవుడ్)- జూలై 19

స్వీట్ మంగోలియాస్ సీజన్ 3- జూలై 20
దే క్లోన్‌డ్‌ టైరోన్ (హాలీవుడ్)- జూలై 21

మొత్తంగా 10: ఇలా జూలై మూడో వారం థియేటర్లలో 4 సినిమాలు, కేవలం శుక్రవారం అంటే జూలై 21న 3 చిత్రాలు విడుదల కానున్నాయి. అలాగే ఓటీటీలో 6 సినిమాలు, జూలై 21న మాత్రం 3 స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక థియేటర్ ఓటీటీ అన్నీ కలిపి మొత్తంగా ఈవారం 10 చిత్రాలు, జూలై 21న 6 సినిమాలు, వెబ్ సిరీసులు సందడి చేయనున్నాయి. వీటిలో హిడింబ, హత్య, బవాల్ సినిమాలపై కాస్తా ఫోకస్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X