OTT: థియేటర్-ఓటీటీల్లో సినీ పండుగ.. మొత్తంగా 21 విడుదల.. ఆ 3 మాత్రం స్పెషల్
సినీ ప్రియులు మళ్లీ ఆనదించే తరుణం వచ్చేసింది. ఎప్పటిలాగానే సోమవారం వచ్చింది. మండే వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు ఏమేం వస్తున్నాయి? ఎక్కడెక్కడా స్ట్రీమింగ్ అవుతున్నాయి? థియేటర్లలో ఎన్ని రీలీజ్? ఓటీటీల్లో ఏవి విడుదల అవుతున్నాయో? తెలిసిపోతుంది.
దీంతో మూవీ లవర్స్ నచ్చిన సినిమా చూసుకోవచ్చు. ఇక గత రెండు మూడు వారాలుగా బేబి వంటి చిన్న సినిమాలు సందడి చేశాయి. ఇప్పుడు పెద్ద సినిమాలతోపాటు బుల్లి చిత్రాలు సైతం అలరించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నాయి.

బ్రో (Bro): మామ అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తొలిసారిగా కలిసి నటించిన సినిమా బ్రో (Bro Movie). నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథనం, సంభాషణలు అందిస్తున్నారు. ఇక ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూలై 28న అంటే శుక్రవారం ప్రేక్షకులను పలకరించనుంది.

రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), క్యూట్ బ్యూటి అలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' (Rocky Aur Rani Ki Prem Kahani). చాలా గ్యాప్ తర్వాత కరణ్ జోహార్ (Karan Johar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 28న రిలీజ్ కానుంది.

స్లమ్ డాగ్ హస్బండ్: సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) కుమారుడు సంజయ్ రావు హీరోగా వస్తున్న చిత్రం 'స్లమ్ డాగ్ హస్బండ్' (Slumdog Husband). కుక్కతో పెళ్లి అనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా ప్రణవి మానుకొండ చేసింది. మైక్ మూవీ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 29న థియేటర్లలో విడుదల కానుంది.

ఓటీటీ: ఆషిఖానా (హిందీ సిరీస్)- జూలై 24 (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
సామజవరగమన (తెలుగు)- జూలై 28 (ఆహా)
రెజీనా (తెలుగు డబ్బింగ్ మూవీ)- జూలై 25 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ట్విస్టెడ్ మెటల్ (ఇంగ్లీష్ సిరీస్)- జూలై 28 (సోనీ లివ్)
పోలీస్ స్టోరి: కేస్ 1: నైట్ ఔల్స్ (తెలుగు సినిమా)- జూలై 28 (ఈటీవీ విన్/ఈ-విన్)
కొళ్ల (మలయాళ సినిమా)- జూలై 27 (మనోరమ మ్యాక్స్)
జియో సినిమా: లయనెస్ (హాలీవుడ్)- జూలై 23 (జియో సినిమా)
కాల్‌కూట్ (హిందీ మూవీ)- జూలై 27 (జియో సినిమా)
వన్ ఫ్రైడే నైట్ (హిందీ సినిమా)- జూలై 28
బుక్ మై షో: జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 25 (బుక్ మై షో)
ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 26 (బుక్ మై షో)
ది ఫ్లాష్ 2023 (ఇంగ్లీష్ సినిమా)- జూలై 27 (బుక్ మై షో)

నెట్‌ఫ్లిక్స్:
డ్రీమ్ (కొరియన్ మూవీ)- జూలై 25
నాయకుడు (మామన్నన్ తెలుగు డబ్బింగ్ మూవీ)- జూలై 27
ప్యారడైజ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 27
హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 27
హిడెన్ స్ట్రైక్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 28
హౌ టు బికమ్ ఏ కల్ట్ లీడర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 28
మొత్తంగా ఎన్నంటే?: ఈ వారం అంటే జూలై నాలుగో వారంలో థియేటర్ అండ్ ఓటీటీ అన్ని కలిపి 21 సినిమాలు, సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లలో 3, ఓటీటీల్లో 18 విడుదల అవుతున్నాయి. ఇక జూలై 28 శుక్రవారం ఒక్కరోజే థియేటర్ అండ్ ఓటీటీ కలిపి 7 సందడి చేయనున్నాయి. అదే రోజున థియేటర్లలో 2, ఓటీటీలో 5 రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక వీటిలో బ్రో, నాయకుడు, సామజవరగమన చిత్రాలు స్పెషల్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











