OTT: థియేటర్లలో సినీ పండుగ.. ఒక్కరోజే 8 సినిమాలు.. ఓటీటీలో ఎన్నో తెలిస్తే?

ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వచ్చి సినీ ప్రియులను ఊరిస్తూ ఉంటాయి. ఎవ్రీ వీక్ కొత్త జోనర్లలో చిత్రాలు విడుదలకు ఎంటర్టైన్ పంచుతాయి. గత వారం అన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.

గతవారం మళ్లీ పెళ్లి, మేము ఫేమస్ వంటి సినిమాలతోపాటు మలయాళం బ్లాక్ బ్లస్టర్ మూవీ 2018లో తెలుగులో రిలీజ్ అయింది. ఈసారి కూడా పలు సినిమాలు, వెబ్ సిరీసులు అటు థియేటర్, ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.

List Of OTT And Theatres Movies Web Series Released On June 1st Week 2023

నేను స్టూడెంట్ సార్: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం చిత్రంతో హీరోగా సినీ ప్రయాణం మొదలు పెట్టాడు. ఇప్పుడు రెండో చిత్రంగా 'నేను స్టూడెంట్ సార్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 2న థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో అవంతిక హీరోయిన్ గా చేయగా.. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

List Of OTT And Theatres Movies Web Series Released On June 1st Week 2023

అహింస: స్టార్ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు కుమారుడు, హీరో రానా తమ్ముడు అభిరామ్ కథానాయకుడిగా పరిచయం కానున్న మూవీ 'అహింస'. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా జూన్ 2న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. లవ్ అండ్ యాక్షన్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాకు చాలా గ్యాప్ తర్వాత ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ మూవీతో నూతన నటీనటులు ఇంట్రడ్యూస్ అవుతున్నారు.

List Of OTT And Theatres Movies Web Series Released On June 1st Week 2023

పరేషాన్: చిన్న పాత్రలు చేస్తూ మినీ హీరోగా పాపులర్ అయ్యాడు తిరువీర్. 'సిన్' వంటి వెబ్ సిరీసులతోపాటు 'మసుదా' లాంటి హారర్ ఫిల్మ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా 'పరేషాన్' అంటూ రాబోతున్నాడు తిరువీర్. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహిరిస్తున్న ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ సైతం జూన్ 2న రిలీజ్ కానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On June 1st Week 2023

చక్రవ్యూహం: తెలుగు సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు నటుడు అజయ్. అప్పట్లో హీరోగా ఓ మూవీ చేసిన ఆయన ఇప్పుడు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'చక్రవ్యూహం'. చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించిన ఈ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 2న అంటే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది తదితరులు నటించారు.

ఐక్యూ: ఇక ఈ సినిమాలతో 'ఐక్యూ' అనే మరో మూవీ కూడా జూన్ 2నే తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ వంటి నూతన నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శ్రీనివాస్ జీఎల్బీ తెరకెక్కించారు.

నెట్ ఫ్లిక్స్: ఫేక్ ఫ్రొఫైల్ (వెబ్ సిరీస్)- మే 31

ఏ బ్యూటిఫుల్ లైఫ్ (వెబ్ సిరీస్)- జూన్ 1
న్యూ ఆమ్‌స్టర్ డామ్ (వెబ్ సిరీస్)- జూన్ 1
ఇన్ఫినిటీ స్ట్రామ్- జూన్ 1
మానిఫెస్ట్ (సీజన్ 4)-జూన్ 2
స్కూప్ (హిందీ వెబ్ సిరీస్)- జూన్ 2

List Of OTT And Theatres Movies Web Series Released On June 1st Week 2023

తొలి వారంలో: ఇవేకాకుండా జూన్ 1న జియో సినిమాలో 'అసుర్' సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్), బుక్ మై షోలో 'ఈవిల్ డెడ్: రైజ్' రిలీజ్ కానుండగా.. జీ5లో 'విశ్వక్' తెలుగు మూవీ జూన్ 2న విడుదల అవుతుంది. ఇలా జూన్ 2న థియేటర్లలో 5, ఓటీటీలో 3 మొత్తంగా 8 సినిమాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక జూన్ తొలి వారంలో 14 విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X