OTT థియేటర్లలో ఫ్రైడే ఫెస్టివల్.. ఓటీటీల్లో 9 సినిమాలు.. మొత్తంగా ఎన్నో తెలిస్తే?

ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతుంటాయి. థియేటర్లలో, ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలవుతూ వినోదాన్ని పంచుతాయి. అలా ఎప్పటిలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు, థియేటర్లతోపాటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే గత కొద్దిరోజులుగా చిన్న సినిమాలే ఎక్కువగా సందడి చేస్తున్నాయి. ఈ వారం అంటే జూన్ రెండో వారం కూడా చిన్న చిత్రాలు అలరించేందుకు రానున్నాయి.

టక్కర్: సిద్ధార్థ్ హీరోగా తాజాగా నటించిన చిత్రం టక్కర్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా చేస్తోంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే మంచి అంచనాలు పెంచేసింది. ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On June 2nd Week 2023

విమానం: నటుడు, దర్శకుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ విమానం. సుముద్ర ఖనితో పాటు మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On June 2nd Week 2023

అన్‌స్టాపబుల్: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ ఎలా హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా రానుంది మూవీ. ఈ అన్‌స్టాపబుల్ మూవీకి రజిత్ రావు నిర్మాతగా వ్యవహరించగా.. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్లుగా చేస్తున్న ఈ మూవీ జూన్ 9న విడుదల కానుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On June 2nd Week 2023

పోయే ఏనుగు పోయే :డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న సినిమా పోయే ఏనుగు పోయే. మాస్టర్ శశాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కె.ఎస్ నాయకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పవనమ్మాళ్ కేశవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏనుగు చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా కూడా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

List Of OTT And Theatres Movies Web Series Released On June 2nd Week 2023

సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై అనే చిత్రం అన్నిటికంటే భిన్నంగా నేరుగా ఓటీటీలో విడుదలై తర్వాత థియేటర్లలో రిలీజై సందడి చేస్తుంది. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా గత నెల 23న జీ5 వేదికగా విడుదల కాగా జూన్ 2 ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు జూన్ 7 నుంచి జీ5 వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

మరికొన్ని ఓటీటీ రిలీజులు

ది ఐడల్ (వెబ్ సిరీస్)- జూన్ 5 (జీ5)
అవతార్ ది వే ఆఫ్ వాటర్- జూన్ 7 (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)
2018- జూన్ 7 (సోనీ లివ్)
మై ఫాల్ట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 8 (అమెజాన్ ప్రైమ్ వీడియో)

బర్రకుడ క్వీన్స్ (వెబ్ సిరీస్)- జూన్ 5 (నెట్‌ఫ్లిక్స్)
ఆర్నాల్డ్ (వెబ్ సిరీస్)- జూన్ 7 (నెట్‌ఫ్లిక్స్)

యూపీ 65 (హిందీ సిరీస్)- జూన్ 8 (జియో సినిమా)
బ్లడ్ డాడీ (హిందీ)- జూన్ 9 (జియో సినిమా)

జూన్ 9న ఎన్నంటే?: ఇలా జూన్ రెండో వారంలో థియేటర్ అండ్ ఓటీటీ కలిపి మొత్తంగా 13 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి. థియేటర్లో మాత్రం నాలుగు సినిమాలు, ఓటీటీలో 9 సినిమాలు, సిరీసులు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక జూన్ 9 అంటే శుక్రవారం ఒక్క రోజునే 5 సినిమాలు విడుదల కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X