OTT థియేటర్లలో సినీ పండుగ.. ఒక్కరోజే 9 సినిమాలు.. మొత్తంగా ఎన్నో తెలిస్తే?
ప్రతివారం సరికొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతుంటాయి. థియేటర్లలో, ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలవుతూ వినోదాన్ని అందిస్తాయి. అయితే ఆదిపురుష్ విడుదలైన తర్వాత రెండు వారాల వరకు థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దాదాపు అన్ని చిత్రాలే రిలీజైన పెద్దగా మెప్పించింది ఏది లేదు. కానీ, జూన్ ఐదో వారం మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీసులు ఏం ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
స్పై : యంగ్ హీరో నిఖిల్ చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం స్పై. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంతోపాటు ఆయన జీవితానికి సంబంధించిన అంశాలతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి. హెచ్ తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 29న విడుదల కానుంది. కె. రాజశేఖర్ రెడ్డి కథ అందించడంతోపాటు ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మించారు. ఇందులో అభినవ్ గోమఠం, ఐశ్వర్య మీనన్, ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్ కీలక పాత్రలు పోషించగా.. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ చేసినట్లు టాక్.

సామజవరగమన: ప్రామిసింగ్ యాక్టర్ శ్రీ విష్ణు లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ సామజవరగమన. వివాహభోజనంబు డైరెక్టర్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ సుంకర్ సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. రెబ్బా మోనిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమా జూన్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. సామజవరగమన సినిమా ట్రైలర్ ను చిరంజీవి విడుదల చేయడంతో బజ్ క్రియేట్ అయింది.

ఇండియానా జోన్స్ 5: హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫ్రాంచైజీ ఇండియానా జోన్స్. 2008లో వచ్చిన ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్ (Indiana Jones 4) భారీ హిట్ నమోదు చేసుకుంది. ఇప్పుడు తాజాగా సుమారు 14 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ లో వస్తున్న సినిమా ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (Indiana Jones and the Dial of Destiny/Indiana Jones 5). ఈ సినిమా జూన్ 30న థియేటర్లలో సందడిచేయనుంది.

థియేటర్లలో మరిన్ని: ఇవే సినిమాలు కాకుండా థియేటర్లలో మరిన్ని చిన్న చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటిలో లవ్ యు రామ్ జూన్ 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హాట్ బ్యూటి పాయల్ రాజ్ పుత్ నటించిన మాయా పేటిక సినిమా కూడా జూన్ 30న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇలా ఈ వారం థియేటర్లలో 5, ఓటీటీలో 9 సినిమాలు-సిరీసులు విడుదల కానున్నాయి. జూన్ 30న థియేటర్లలో 3, ఓటీటీలో 5 రానున్నాయి. జూన్ 5వ వారంలో మొత్తంగా ఈ వారం 14 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఓటీటీ:
వీకెండ్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్)- జూన్ 28 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
ది నైట్ మేనేజర్ (సీజన్ 2)- జూన్ 30 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
గుడ్ నైట్-జులై 3 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
లస్ట్ స్టోరీస్ 2 (వెబ్ సిరీస్)- జూన్ 29 (నెట్ ఫ్లిక్స్)
అఫ్వా (Afwaah-హిందీ)- జూన్ 30 (నెట్ ఫ్లిక్స్)
జాక్ ర్యాన్ (సీజన్ 4-వెబ్ సిరీస్ )- జూన్ 30 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
వీరన్-జూన్ 30 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
ఫాస్ట్ ఎక్స్- జూన్ 29 (బుక్ మై షో)
అర్థమయ్యిందా అరుణ్ కుమార్ (వెబ్ సిరీస్)- జూన్ 30 (ఆహా)
లకద్బగ్గ (Lakadbaggha)- జూన్ 30 (జీ5)


Click it and Unblock the Notifications











